యాక్షన్, ఎమోషన్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన ‘వెంకీ మామ’ ట్రైలర్….!!

-

విక్టరీ వెంకటేష్ మరియు అక్కినేని నాగచైతన్య హీరోలుగా తొలిసారి కలిసి నటిస్తున్న ‘సినిమా వెంకీ మామ’. యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై సురేష్ బాబు, టిజి విశ్వ ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ మరియు ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడంతో పాటు సినిమాపై అంచనాలు కూడా పెంచేయడం జరిగింది.

ఇక నేడు జరుగుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ట్రైలర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్, నాగచైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ నిజంగా చాలా బాగుందని చెప్పాలి. ‘ఈసారి జాతారని రంగులతో కాదు మీ రక్తంతో ఎరుపెక్కిస్తా’….’నీ నుండి నన్ను నువ్వు కూడా దూరం చేయలేవు మావయ్య’ అంటూ వెంకటేష్, నాగ చైతన్య చెప్పే డైలాగ్స్ సినిమాపై మంచి ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇక ఈ ట్రైలర్ ని బట్టి సినిమా మంచో ఎమోషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ మరియు కమర్షియల్ అంశాలతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

 

ఇక ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. విక్టరీ వెంకటేష్ ఒక రైతుగా, అలానే నాగచైతన్య సోల్జర్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ఈనెల 13వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. మరి తొలిసారి మామ అల్లుళ్ళు కలిసి నటిస్తున్న ఈ సినిమా ఎంత మేరకు సక్సెస్ ని సాధిస్తుందో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news