‘ఉరి’ సినిమా కాంబినేషన్ మరోసారి రిపీట్ అవ్వబోతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ మరోసారి నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ పేరుని ఖరారు చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీలో విక్కీకి జోడీగా టాలీవుడ్ జెస్సీ సమంత నటించనున్నట్లు సమాచారం. ఇటీవలే సామ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. రెండు భాగాలుగా ఈ సినిమా ఉంటుందని, దీనికోసం భారీ బడ్జెట్ ఖర్చు పెడుతున్నట్లు చిత్రబృందం చెబుతోంది. మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను స్ఫూర్తిగా తీసుకుని సూపర్ హీరో క్యారెక్టర్‌ను డిజైన్ చేస్తున్నట్లు ఆదిత్య ధర్ తెలిపారు.
‘ఈ సినిమా నా మూడేళ్ల కల. స్టోరీ బోర్డ్‌తో సహా ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేశాం. ఈ కథను ఒకేసారి చిత్రీకరించి, రెండు భాగాల సినిమాగా విడుదల చేస్తాం. ఇండియన్ స్క్రీన్‌పై మరో సూపర్ హీరో చిత్రంగా రూపొందిస్తాం’ అని ఆదిత్య ధర్ అన్నారు.