వెంకీ సినిమాకు బ్రహ్మోత్సవం దర్శకుడు….??

-

గురు, ఎఫ్2 సినిమాలతో వరుసగా రెండు సక్సెస్ లు అందుకున్న విక్టరీ వెంకటేష్, ప్రస్తుతం తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి నటిస్తున్న తాజా సినిమా వెంకీ మామ. యువ దర్శకుడు కె ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మంచి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కించుకోవడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో బాగా అంచనాలు కూడా పెంచడం జరిగింది. వెంకటేష్ ఒక రైతుగా, అలానే నాగచైతన్య సైనికుడిగా నటిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా తరువాత వెంకటేష్, ఇటీవ తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన అసురన్ రీమేక్ లో నటించబోతున్నట్లు ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శకుడిగా హను రాఘవపూడి పేరు దాదాపుగా ఖరాయినప్పటికీ, నేడు కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఆయన స్థానంలో మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం సినిమాను తీసిన శ్రీకాంత్ అడ్డాలకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

గతంలో మహేష్, వెంకటేష్ ల కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ చెట్టు సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహించి ఉండడంతో, వెంకటేష్ కూడా శ్రీకాంత్ అయితే అసురన్ రీమేక్ ని సరిగ్గా తెరకెక్కించగలనరి భావించి ఆయనకే మొగ్గుచూపినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా నేడు ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఆ సినిమా నిర్మాతల నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మంచి యాక్షన్ కథాంశంగా తెరకెక్కిన అసురన్ ను తెలుగులో శ్రీకాంత్ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీస్తారో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news