పూరికి విజయ్ ఛాన్స్..?

-

ఒకప్పుడు క్రేజీ డైరక్టర్ గా స్టార్స్ తో వరుస హిట్లు అందుకున్న పూరి జగన్నాథ్ ఇప్పుడు ఖాళీ అయ్యాడు. లోఫర్ నుండి పూర్తి వరుసగా ఫ్లాపులు తీస్తున్నాడు. తనయుడు ఆకాష్ పూరితో తీసిన మెహబూబా కూడా నిరాశ పరచడంతో పూరి అసలు కనిపించకుండా పోయాడు. అయితే మళ్లీ ఆకాష్ తోనే మరో సినిమా చేస్తున్నాడని వార్తలు రాగా విజయ్ దేవరకొండతో పూరి సినిమా చేసే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

యువ హీరోల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ టాక్సీవాలాతో రీసెంట్ గా మరో క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ పూరితో డిస్కషన్స్ జరిపాడట. అయితే వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ పూరికి ఛాన్స్ ఇస్తాడా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకవేళ విజయ్ ఓకే చెబితే దేవరకొండ విజయ్ తో పూరి చేసే సినిమా మాత్రం కచ్చితంగా కొత్తగా ఉంటుందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news