ఆడడం మొదలు పెట్టావో.. విజయ్ ‘నోటా’ ట్రైలర్

-

లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ ఆనంద్ రంగ డైరక్షన్ లో వస్తున్న సినిమా నోటా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాను కేయి జ్ఞానవెల్ రాజా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. సినిమాలో సత్యరాజ్, నాజర్ లాంటి లీడింగ్ యాక్టర్స్ ఉన్నారు. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది.

వీడియో గేం ఆడుకునే కుర్రాడిని తెచ్చి రాజకీయ నాయకుడిని చేస్తే ఎలా ఉంటుందో చెప్పే కథతో వస్తుంది నోటా. ట్రైలర్ కటింగ్ అదిరిపోయింది. అంతేకాదు ఆడడం మొదలు పెట్టావో.. ఆపడం నీ చేతుల్లో ఉండదు లాంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ లో విజయ్ లుక్ అదుర్స్ అనేలా ఉన్నాయి.

ఈమధ్యనే గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ రోల్ కు భిన్నంగా మరో డిఫరెంట్ అటెంప్ట్ తో నోటా సినిమా చేస్తున్నాడు. అక్టోబర్ 4న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే విజయ్ ఖాతాలో మరో హిట్ పడేట్టు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news