#KillFakeNews ఫేక్ న్యూస్ పై సమరం.. విజయ్ దేవరకొండకు మద్దతుగా సినీ ప్రముఖులు ..!!

-

తెలుగు చిత్ర పరిశ్రమ చాలా పెద్దది. కొన్ని వందల కుటుంబాలకి అన్నం పెడుతున్న పరిశ్రమ. ప్రేక్షకులకు వినోదం అందించడం ప్రధాన లక్ష్యంగా మన చిత్ర పరిశ్రమలోని హీరోలు అని జోనర్స్ లో సినిమాలను తీసి మన ముందుకు తీసుకు వస్తున్నారు. వాటిలో సూపర్ హిట్స్ ఉంటున్నాయి. కొన్ని సందర్భాలలో ఫ్లాప్స్ కూడా ఉంటున్నాయి. ఒక ఫ్లాప్ వచ్చిన మళ్ళీ మన హీరోలు, దర్శక.. నిర్మాతలు సినిమాలు తీస్తూనే ఉంటారు. మనం ఆదరిస్తూనే ఉంటాము. అందుకే చిత్రపరిశ్రమలోని అందరు ప్రేక్షకులను దేవుళ్ళు అంటారు.

ఇక మనం ఇంతగా ఆదరిస్తున్నామన్న ఉద్దేశ్యంతో ఎప్పుడు ఎలాంటి ప్రకృతి విపత్తు వచ్చి ప్రజలు, చిత్ర పరిశ్రమలోని కార్మీకులు ఇబ్బందులు పడుతున్న సమయంలో అండగా నిలుస్తున్నారు. ఇందుకు ఏ ఒక్క హీరోనో లేక దర్శక, నిర్మాతలో కాదు..యావత్ చిత్ర పరిశ్రమ ఏకమై పేదలకు అండగా ఉంటూ అక్కున చేర్చుకుంటున్నారు. కావాల్సిన అవసరాలను సమకూర్చి మీకు మేము ఉన్నామంటూ భరోసా ఇస్తున్నారు. అంత గొప్పది మన తెలుగు చిత్ర పరిశ్రమ ..మన హీరోలు.. దర్శక నిర్మాతలు.

ఈ నేపథ్యంలోనే కరోనా విపత్తు సంభవించి ప్రాంచమంతా అతలాకులమయిన సంగతి తెలిసిందే. దీనితో అన్ని పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమలకి వేల కోట్లలో ఆర్ధిక నష్ఠం వాటిల్లింది. లాక్ డౌన కారణంగా ఎక్కడివి అక్కడ స్థంభించిపోయాయి. ఫలితంగా సినీ కార్మీకులకి పూట గడవడం కష్టం గా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలకు, సినీ కార్మీకులకు చిత్ర పరిశ్రమలోని వారందరూ తమ వంతు సహాన్ని అందిస్తున్నారు. విరాళాలలని ప్రకటిస్తున్నారు. కాని కొన్ని వెబ్ సైట్స్ మాత్రం చిత్ర పరిశ్రమ మీద, నటీ నటుల మీద లేనిపోని రాతలు రాస్తూ, విరాళాలు ఎందుకివ్వలేదంటూ.. కించపరిచే విధంగా అవమానిస్తున్నారు.

ఈ రాతలు రోజు రోజుకీ ఎక్కువవుతుండటంతో నెల రోజులుగా ఇవన్ని చూస్తూ భరించిన హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. తప్పుడు రాతలు రాస్తున్న వెబ్ సైట్స్ ని ఉద్దేశించి మాట్లాడారు. దీనికి సంబంధించి 21 నిముషాల పాటు ఉన్న వీడియోని రిలీజ్ చేసి ఆవేదన చెందారు. ఇందుకు టాలీవుడ్ మొత్తం మద్దతు తెలిపింది. దర్శకుడు కొరటాల శివ, మెగా బ్రదర్ నాగ బాబు, రవితేజ, రానా …ఇలా ప్రతీ ఒక్కరు విజయ్ దేవరకొండకి సపోర్ట్ గా నిలిచారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ్ దేవరకొండ తో కలిసి పోరడదాం అంటూ సపోర్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news