భారీ ఆఫర్ కొట్టేసిన విజయ్ దేవరకొండ..!

-

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఒక భారీ ఆఫర్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ హోం భలే ఫిలింస్ వారు నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్.. రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్లో తెరకేక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే సలార్ సినిమాలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే సలార్ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా సెట్ లో విజయ్ దేవరకొండ ఫోటోలు ఈ వార్తకు బలాన్ని చేకూరుస్తూ ఉండడం గమనార్హం.. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ.. ప్రభాస్ కి తమ్ముడు క్యారెక్టర్ లో నటించబోతున్నారు.

అయితే అటు ప్రభాస్ , ఇటు విజయ్ దేవరకొండను ఒకే ఫ్రేమ్లో చూడాలని కలలు కన్న అభిమానుల కోరిక తీరబోతోంది. అయితే ఇప్పటివరకు సలార్ లో విజయ్ నటిస్తున్నాడు అని చిత్ర యూనిట్ ఎక్కడ కూడా ప్రకటించలేదు. ప్రస్తుతం రౌడీ బాయ్ కు సంబంధించిన రఫ్ లుక్ మాత్రం వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా ఖుషి సినిమా చేస్తున్నాడు.. అటు ప్రభాస్ సైతం సలార్ తో పాటుగా నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే అనే చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news