‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’ సినిమాలతో విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు మూటగట్టుకున్నాడు. ఇక నుంచైనా ఆచితూచి సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకే కంటెంట్ ఉన్న డైరెక్టర్లతో జోడీ కట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో టాలీవుడ్ జెస్సీ సమంతతో ‘ఖుషీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే హైదరాబాద్లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభించనుంది. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకులు ముందుకు రానుంది.
‘లైగర్’ ఫ్లాప్ తో ఆచితూచి అడుగులు వేస్తున్న విజయ్.. తర్వాత తన సినిమాలను పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా నేచురల్ స్టార్ నాని డైరెక్టర్లతో పని చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘నిన్ను కోరి’ డైరెక్టర్ శివ నిర్వాణతో ఖుషీ సినిమా చేస్తున్న విజయ్.. ఇప్పుడు ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో వర్క్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం.
‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరితో విజయ్ తన తదుపరి సినిమా చేయనున్నట్లు టాక్. ఇటీవలే గౌతమ్, విజయ్ను కలిసి ఓ కథ నెరేట్ చేశాడని, కథ బాగా నచ్చడంతో విజయ్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. మరి నాని డైరెక్టర్లు విజయ్ దేవరకొండకు కలిసొస్తారా లేదా చూడాలంటే ఈ మూవీస్ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.