ఈ నెల 23న తెలంగాణలోకి రాహుల్‌ గాంధీ పాదయాత్ర

-

ఈ నెల 23న తెలంగాణలోకి రాహుల్‌ గాంధీ పాదయాత్ర ఎంటర్‌ కానుందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజా స్వామ్యం ఎంత బలంగా ఉందొ అనేది ఖర్గే ఎన్నిక నిదర్శనమని చెప్పారు. ట్రాక్ రికార్డ్ ఉన్న నాయకుడు అధ్యక్షుడు కావడం గర్వ కారణమని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర దేశ చరిత్రలో అద్భుతమని.. దేశ చరిత్ర లో నిలిచిపోతుందన్నారు.

తెలంగాణ లో కూడా మిగిలిన రాష్టల్లో కంటే బాగా నిర్వహిస్తామని… రాహుల్ గాంధీ ఇంటరాక్షన్ వ్యవహారం చూస్తామని స్పష్టం చేశారు. 2023 లో తెలంగాణ లో అధికారం లోకి వస్తామని.. 2024 లో కేంద్రం లో అధికారం ఖాయమన్నారు. పాదయాత్ర లో రాహుల్ గాంధీ హామీలు కూడా ఇస్తారని స్పష్టం చేశారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. తెలంగాణలో నిరుద్యోగ సమస్య పై రాహుల్ గాంధీ మాట్లాడతారని వెల్లడించారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news