అభిమానం హ‌ద్దు మీరింది..క‌త్తుల‌తో దాడి

-

కోలీవుడ్ హీరోల అభిమానం హ‌ద్దు మీరితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ముఖ్యంగా త‌ళ అజిత్-విజయ్ అభిమానుల మ‌ధ్య వార్ ఎప్ప‌టికీ సంచ‌ల‌న‌మే. ఇరువురి హీరోల అభిమానులు ఎన్నో సార్లు ప‌బ్లిక్ గా కొట్టుకున్నారు. పోస్ట‌ర్ల మ‌ధ్య త‌లెత్తిన వివాదం కొట్టుకునే వ‌ర‌కూ దారి తీసింది. ఇటీవ‌లే విజ‌య్ చ‌నిపోయాడంటూ అజిత్ అభిమానులు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం లేవ‌నెత్తారు. దీంతో త‌మిళ‌నాడు మొత్తం ఒక్క‌సారిగా షాక్ అయింది. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే ఇద్ద‌రి హీరోల అభిమానుల మాధ్య ఏకంగా క‌త్తుల‌తో దాడే జ‌రిగింది.

Vijay fan arrested for stabbing Ajith fan in Chennai

త‌మిళ‌నాడులోని పుళ‌ల్ సమీపంలోని శ్రీలంక శ‌రణార్దుల శిభిరంలో ఉంటోన్న ఉమాశంక‌ర్ మ‌రియు రోష‌ల్ లు త‌మ అభిమాన హీరో గురించి మాట్లాడుకుంటూ ఉండ‌గా ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు త‌లెత్తాయి. అజిత్ వీరాభిమాని అయిన ఉమాశంక‌ర్ విజ‌య్ కి అభిమాని అయిన రోష‌న్ ల మ‌ధ్య మాట మాట పెరిగింది. దీంతో స‌హ‌నం కోల్పోయిన రోష‌న్ , ఉమాశంక‌ర్ పై క‌త్తితో దాడి చేసాడు. శ‌రీర‌మంతా విచ‌క్ష‌ణ ర‌హితంగా క‌త్తి గాట్లు పెట్టాడు. దాంతో వెంట‌నే స్థానికులు ఉమాశంకర్ ని ద‌గ్గ‌ర్లో గ‌ల ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. గ‌తంలో కూడా ఇలాంటి క‌త్తి దాడులు జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి పోలీసుల తెలిపారు. హ‌త్య‌లు కూడా జ‌రిగిన సంఘ‌ట‌నలు ఉన్నాయ‌ని, హ‌త్య‌లు జ‌రిగిన చ‌రిత్ర త‌మిళ‌నాడు అభిమాను మధ్య ఉంద‌ని పోలీసులు తెల‌ప‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఈ విష‌యంలో అభిమానుల‌కు కౌన్సిలింగ్ ఇచ్చినా మార లేద‌ని తెలిపారు. అభిమానుల విష‌యంలో హీరోలు ఎన్నిసార్లు అవ‌ర్ నెస్ తీసుకొచ్చినా విని వ‌దిలేస్తున్నారు త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌లేద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news