ఒకేసారి పాతిక ప్రాజెక్టులు చేస్తున్న విజ‌య్ సేతుప‌తి!

-

కొంద‌రు హీరోలు ఏడాదికి ఒక‌టి లేదా రెండు సినిమాలు మాత్ర‌మే చేస్తున్నారు. ఇంకొంద‌రైతే త‌మ ట్యాలెంట్‌తో ఏకంగా మూడు నుంచి నాలుగు సినిమాలు కూడా చేసేస్తున్నారు. కానీ ఒకేసారి ప‌దుల సంఖ్య‌లో సినిమాలు చేస్తున్న న‌టుడు మాత్రం విజ‌య్ సేతుప‌తి. అటు హీరోగానే కాకుండా ఇటు విల్ పాత్ర‌లు, ఇత‌ర కీ రోల్ పాత్ర‌ల్లో ఆయ‌న మెరుస్తున్నారు.

 విజ‌య్ సేతుప‌తి

ప్ర‌స్తుతం ఆయ‌న తమిల్‌, తెలుగుతో పాటు హిందీ భాష‌ల్లో ప‌దుల సంఖ్య‌లో మూవీలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇందులో కొన్ని షూటింగ్ ద‌శ‌లో ఉంటే మ‌రికొన్ని సినిమాలు ప్రీ ప్రొడ‌క్ష‌న్ దశలో ఉన్నాయ‌ని తెలుస్తోంది. అత్యంత ట్యాలెంట్ ఉన్న విల‌క్ష‌న‌మైన న‌టుడిగా ఆయ‌న‌కు పేరుంది. అందుకే ఆయ‌న‌కు అన్ని ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

ఇక సినిమాలే కాకుండా ఆయ‌న అటు వెబ్ సిరీస్‌ల‌లో కూడా మెరుస్తున్నారు. ఇంకోవైపు టీవీ షో ల‌తో పాటుగా ఇత‌ర ప్రోగ్రామ్‌లు కూడా చేస్తున్నఈ విల‌క్ష‌ణ న‌టుడు చేతిలో ఏకంగా పాతిక ప్రాజెక్ట్ ల‌ను పెట్టుకుని ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక న‌టుడు గానీ హీరోగానీ ఇన్ని ప్రాజెక్టులు ఒకే టైమ్‌లో చేసి ఉండ‌డు. అందుకే ఆయ‌న ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news