విజయ్ సేతుపతి పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి కారణం..?

-

విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు మొన్నటి వరకు పెద్దగా పరిచయం లేని పేరు. కానీ ఉప్పెన సినిమాతో మొదటి సారి విలన్ గా తన లోని విలనిజాన్ని చూపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి తెలుగు లో ఎక్కువగా విలన్ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపించాడు. మొదటిసారి 96 అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ను అందుకున్న ఆయన ఓవర్ నైట్ లో నే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు తమిళనాట మంచి సినిమాలు చేసి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి పరిస్థితి మాత్రం ప్రస్తుతం చాలా దారుణంగా ఉందని తెలుస్తోంది.Vijay Sethupathi Says Attack On Him Was 'Blown Out Of Propotion'సాధారణంగా ఎవరైనా సరే కథకు తగ్గట్టుగా పాత్రలు ఉండాలి అని ముఖ్యంగా ఆ పాత్ర ద్వారా తమకు పేరు రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ విజయ్ సేతుపతి మాత్రం డబ్బు కోసమో రొటీన్ పాత్రలు చేస్తున్నాడు అని ఇండస్ట్రీలో వార్తలు కోడై కూస్తున్నాయి. ఇక ఇటీవల విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార, సమంత హీరోయిన్లుగా విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన కన్మణి రాంబో ఖతీజా ఏ స్థాయిలో డిజాస్టర్ గా మిగిలిందో మనకు తెలిసిందే. ఈ సినిమా బాగా హిట్ అవుతుందని ఎన్నో రకాలుగా ప్రమోషన్లు కూడా చేపట్టారు. కానీ సేమ్ లవ్ స్టోరీ, సేమ్ కామెడీతో విజయ్ సేతుపతి మళ్ళీ ముందుకు రావడంతో ప్రేక్షకులు ఆదరించలేదు అని తెలుస్తోంది.Vijay Sethupathi Birthday Special: Net Worth, Remuneration And Luxury Vehicles Owned By Makkal Selvan! - Filmibeatరొటీన్ కథలు ఎంచుకుంటూ ఎక్కువగా పారితోషకం తీసుకుంటున్న నేపథ్యంలో విజయ్ సేతుపతికి సినిమా అవకాశాలు కూడా తగ్గుతున్నాయని సమాచారం. విజయ్ సేతుపతి కనీసం ఇప్పటికైనా తన క్యారెక్టర్ కి తగ్గట్టుగా పాత్రలు ఎంచుకోవాలని రొటీన్ కథను వదిలేయాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ సేతుపతి డబ్బుల కోసమే నటిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఆయన కెరియర్ మధ్యలోనే ఆగిపోతుందని చెప్పడంలో సందేహం లేదు అంటూ అభిమానులు కూడా కొంతవరకు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news