ఏడేళ్ల వయసులోనే ఆమె బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడు అన్నీ మగవేషాల్లోనే నటించారు. తొలి సినిమాలో రాజకుమారుడిగా కనిపించారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే ఆమె ఓ వెలుగు వెలిగారు. దర్శకురాలిగానే కాదు.. నటిగానూ ఆమె చరిత్ర సృష్టించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమెది అలుపెరుగని పోరాటం. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏనాటికి మరువలేని వ్యక్తి ఆమె. దీంతో విజయ నిర్మల మృతిని సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. ఈసందర్భంగా ఆమె చేసిన పాత్రలు, ఆమె నటించిన సినిమాలు, వైవిధ్యమైన పాత్రలు, దర్శకత్వం వహించిన సినిమాలు, ఆమె సినీ జీవితం గురించి గుర్తు చేసుకుంటున్నారు.
ఏడేళ్ల వయసులోనే ఆమె బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడు అన్నీ మగవేషాల్లోనే నటించారు. తొలి సినిమాలో రాజకుమారుడిగా కనిపించారు. ఆ తర్వాత పాండురంగమహత్యంలో పాండురంగడిగా మెప్పించారు.
బాలనటిగా నటించిన అన్ని సినిమాల్లోనూ ఆమె మగవేషాల్లోనే కనిపించారు. ఒక్క భూకైలాస్‌లో మాత్రం సీతగా నటించారు. ఆ తర్వాత రంగులరాట్నం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత విజయ నిర్మల వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.