మీకిది తెలుసా.. బాహుబలి 3 రెడీ అవుతుంది..!

-

బాహుబలి.. ఈ పేరు వింటేనే ప్రతి ప్రేక్షకుడికి ఒళ్లు పులకరించేలా.. రోమాలు నిక్కబొడుచుకునే భావన కలుగుతుంది. తెలుగు సినిమా 50, 100 కోట్ల మధ్య కొట్టు మిట్టాడుతూ.. సౌత్ లోనే సత్తా చాటడానికి అటు ఇటుగా ఉండగా నేషనల్ వైడ్ గా కాదు వరల్డ్ వైడ్ గా ఇది తెలుగు సినిమా దమ్ము అని చూపించేలా చేసిన సినిమా అది. రాజమౌళి దర్శకుడి ప్రతిభకు దేశ సిని ప్రేమికులంతా సాహోరే అని చెప్పిన సందర్భాలు ఎన్నో.

రెండు పార్టులుగా వచ్చిన ఈ బాహుబలి ఇంకా ప్రేక్షకుల మదిలోనే ఉంది. ఎక్కడైనా.. ఎప్పుడైనా బాహుబలి అని వినిపిస్తే చాలు మనకు తెలియకుండానే మన కళ్లు.. మనసు లాగేస్తుంది. ఆ సినిమా చేసిన హంగామా అందరికి తెలిసిందే. సినిమా కోసం ఐదేళ్లు కష్టపడినా అంతకుమించిన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఆ సినిమా పార్ట్ 3 తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది.

ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ బాహుబలి 3 కథ కోసం కత్తులు నూరుతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా సీక్వల్ అంటే మరో ఐదేళ్లు పడుతుందని భావించి రాజమౌళి ఎన్.టి.ఆర్, చరణ్ సినిమా ఫిక్స్ అయ్యాడు. కాని ప్రేక్షకుల కోరిక మేరకు బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఈరోస్ వారికి 10 స్టోరీస్ ఇచ్చేలా భారీ డీల్ సెట్ చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news