వాట్సాప్‌లో గ్రూప్ కాలింగ్ వచ్చేసింది! గ్రూప్‌ కాల్‌ ఎలా చేయాలి??

-

WhatsApp introduces group calling for voice and video
వాట్సాప్ వినియోగదారులకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గ్రూప్ కాలింగ్‌ను తాజా ప్రవేశపెట్టినట్టు వాట్సాప్ వెల్లడించింది. వీడియో, వాయిస్ రెండింటిలో కూడా అందుబాటులో ఉండే ఈ గ్రూప్ కాలింగ్ ద్వారా ఒకేసారి నలుగురితో మాట్లాడొచ్చు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న అన్ని ఫోన్లలో ఇది పనిచేస్తుంది. గత అక్టోబర్‌లో వాట్సాప్ గ్రూప్‌కాలింగ్ గురించి తొలిసారి బయటకు తెలవగా, ఈ ఏడాది మేలో వాట్సాప్ దానిని అధికారికంగా ప్రకటించింది.

వాట్సాప్‌లో గ్రూప్ కాలింగ్ ఎలా చేయాలి..?
గ్రూప్ కాలింగ్ కోసం ప్లేస్టోర్‌లో వాట్సాప్ తాజా వర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రూప్ కాల్ చేయడానికి కాల్ చేసే వ్యక్తి మొదట మరో వ్యక్తికి కాల్‌ను కనెక్ట్ చేయాలి.
తర్వాత స్క్రీన్‌పై పైభాగంలో కుడివైపు మరో కాంటాక్ట్‌ను యాడ్‌చేసే ఆప్షన్ కనిపిస్తుంది.
ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా మరో వ్యక్తిని గ్రూప్ కాలింగ్‌లో యాడ్ చేయవచ్చు. ఇలా మొత్తం నలుగురిని గ్రూప్‌కాల్‌లో మాట్లాడే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news