విక్రంతో బన్ని కాదు నాని

-

అల్లు అర్జున్ తో సినిమా కోసం కాళ్ల చెప్పులు అరిగేలా తిరిగిన విక్రం కుమార్ ఇక లాభం లేదు అనుకున్నాడో ఏమో బన్నితో సినిమా ప్రయత్నాలు మానేసినట్టు తెలుస్తుంది. విక్రం కథకు బన్ని ఓకే చెప్పినా స్క్రీన్ ప్లే తేడా కొడుతుందని వద్దన్నాడట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయంలో ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు వస్తున్నాయట. అందుకే బన్ని ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టాడు. బన్ని కోసం సంవత్సరం పాటు వెయిట్ చేసిన విక్రం కుమార్ ఇక తను వేరే దారి చూసుకోనున్నాడని తెలుస్తుంది. బన్ని ఎలాగు త్రివిక్రం కు ఫిక్స్ అయ్యాడు కాబట్టి విక్రం తన కథను వేరే హీరోతో చేసే ప్రయత్నాల్లో ఉన్నాడట.

నాచురల్ స్టార్ నానిని పెట్టి బన్నికి అనుకున్న కథను సినిమాగా చేస్తాడని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఆ సినిమా నిర్మించబడుతుందని తెలుస్తుంది. అయితే హీరోని మార్చారు కాని తమ బ్యానర్ లోనే ఆ సినిమా చేస్తున్నారన్నమాట. ఒకవేళ సినిమా హిట్ అయితే ప్రాఫిట్ రాబట్టుకునే ఆలోచన అన్నమాట. విక్రం కెరియర్ లో మనం తప్ప కమర్షియల్ గా ఏది వర్క్ అవుట్ కాలేదు. మరి నానితో సినిమా అయినా సూపర్ హిట్ కొడతాడో లేదో చూడాలి. ప్రస్తుతం నాని జెర్సీ సినిమా షూటింగ్ లో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news