టాలీవుడ్ ఓవ‌ర్సీస్ మార్కెట్‌కు విల‌న్ ఎవ‌రంటే….

-

గ‌త ఆరేడు నెల‌లుగా చూస్తుంటే తెలుగు సినిమాల‌కు ఓవ‌ర్సీస్ మార్కెట్ ద‌బేల్ మ‌ని ప‌డిపోతూ వ‌స్తోంది. యేడాది క్రితం వ‌ర‌కు తెలుగు సినిమాల‌కు అక్క‌డ అదిరిపోయే బిజినెస్ జ‌రిగేది. నాని లాంటి హీరోలు సైతం మంచినీళ్లు తాగినంత సులువుగా అక్కడ 2 మిలియ‌న్ డాల‌ర్ల‌ను క్రాస్ చేసేవారు. నాని సినిమాకుల కూడా అక్క‌డ మంచి రేటు ప‌లికేది.

అయితే ఆరేడు నెల‌లుగా ప‌రిస్థితి రివ‌ర్స్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోలు కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి సైరా న‌ర‌సింహారెడ్డి లాంటి సినిమాలు తీస్తే అక్క‌డ ఆ సినిమా 2 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేసేందుకు ఆప‌సోపాలు ప‌డాల్సి వ‌చ్చింది. ఈ సినిమాకు టాక్ బాగుంది… రివ్యూలు బాగా వ‌చ్చాయి. అయినా సినిమా చూసేందుకు ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డ‌లేదు.

మ‌రి తేడా ఎక్క‌డ ఉంది.. ఎందుకు ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కులు హిట్ సినిమాలు కూడా చూడ‌డం లేదంటే ఇక్క‌డే ఆస‌క్తిక‌ర స‌మాధానం దొరికేసింది. బ‌య్య‌ర్లు గ‌తంలోలా ఆఫ‌ర్లు ఇవ్వ‌క‌పోవ‌డం ఒక మైన‌స్ అయితే… ఓవర్సీస్‌ బిజినెస్‌ని ప్రభావితం చేయ‌డం మ‌రో కార‌ణం. ఏ సినిమా అయినా అమొజాన్ ప్రైమ్ కొన్నది అంటే ఇక థియేట‌ర్ల‌కు వ‌చ్చి ఎవ్వ‌రూ చూడ‌డం లేదు. ఎందుకంటే రెండు నెల‌లు ఆగితే ఎంచ‌క్కా ఇంట్లోనే సినిమా చూసేయొచ్చు.

కొన్ని సార్లు నెల రోజుల‌కే సినిమాలు వేసేస్తున్నారు. ఇంట్లోనే కూర్చొని హైక్వాలిటీ ఫ్రింట్‌ను ఎంచ‌క్కా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడొచ్చు. అందుకే ఏకంగా 400 డాల‌ర్లు పెట్టి సినిమా చూసేందుకు ఎవ్వ‌రు ముందుకు రావ‌డం లేదు. మ‌రో వైపు సిటీస్‌లో రిపీట్‌ ఆడియన్స్‌ బాగా తగ్గిపోయారు. హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను నాలుగైదు నెల‌ల‌కు కాని అమోజాన్‌లో పెట్ట‌రు. మ‌రి తెలుగు సినిమాల‌కు ఇంత దుస్థితి ఎందుకో ? అర్థం కావ‌డం లేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news