‘విమానం’ ట్రైలర్ రిలీజ్.. తండ్రీకొడుకులు ఏడిపించేశారుగా

-

బస్తీలో ఉండే దివ్యాంగుడైన ఓ తండ్రి విమానం ఎక్కాలన్న తన కొడుకు కలను ఎలా నేరవేర్చాడనే అంశంతో తెరకెక్కిన సినిమా విమానం. శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు మేకర్స్. సముద్రఖని తండ్రిగా నటిస్తుండగా.. మాస్టర్ ధ్రువన్ కొడుకు పాత్రలో కనిపించాడు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ నటి మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో మీరా జాస్మిన్ ఎయిర్​ హోస్టెస్​గా నటిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఇందులో అనసూయ భరద్వాజ్ స్పెషల్ అట్రాక్షన్.

రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రముఖ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ విమానం ట్రైలర్ ను విడుదల చేసింది. తండ్రి కొడుకుల అనుబంధాన్ని చాటుతూ ఉద్వేగభరితమైన కథతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. కిరణ్ కొర్రపాట, జి స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Read more RELATED
Recommended to you

Latest news