ఎన్టీఆర్ నటనపై విశాల్ కామెంట్

-

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ టెంపర్. తారక్ కెరియర్ లో టెంపర్ సినిమా చాలా మార్పులు తెచ్చింది. ఆ సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన అరవింద సమేత వరకు ఎన్.టి.ఆర్ వరుస హిట్లు కొడుతూనే ఉన్నాడు. ఎన్.టి.ఆర్ నటించిన టెంపర్ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారు. విశాల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి విశాల్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెళ్లడించారు.

తెలుగు టెంపర్ నుండి రీమేక్ గా వస్తున్న తన సినిమా చాలా మార్పులు చేశామని. ఇక టెంపర్ సినిమాలో ఎన్.టి.ఆర్ నటించినట్టుగా తాను నటించలేనని. ఎన్.టి.ఆర్ నటిస్తే అది 10-15 ఏళ్లు గుర్తుండి పోతుందని. ఇక టెంపర్ రీమేక్ గా వస్తున్న తన సినిమా తెలుగులో రిలీజ్ చేయట్లేదని. ఎన్.టి.ఆర్ నటనతో తనకు పోలి చూస్తారని అందుకే ఈ రీమేక్ తెలుగులో రిలీజ్ చేయట్లేదని చెప్పాడు విశాల్.

Read more RELATED
Recommended to you

Latest news