అర్జున్ కి క్షమాపణలు చెప్పి.. తప్పు ఒప్పుకున్న విశ్వక్ సేన్..!

-

గత కొన్ని రోజులుగా సీనియర్ యాక్టర్ అర్జున్ సర్జాకి యంగ్ హీరో విశ్వక్ సేన్ కి మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరికి సంబంధించి సినిమా వివాదం నడుస్తుండగా అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి విశ్వక్ సేన్ కి నటుడిగా కమిట్మెంట్ లేదంటూ విమర్శలు గుప్పించాడు. దాంతో ఎట్టకేలకు విశ్వక్ సేన్ స్పందించి అసలు గొడవ ఏంటి ? ఎందుకు అలా సినిమా షూటింగ్ ను ఆపేయాల్సి వచ్చింది అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే అర్జున్ కి బహిరంగంగానే క్షమాపణలు కూడా చెప్పాడు. అర్జున్ స్వీయ దర్శకత్వంలో ఒక సినిమాను చేయాలని ప్లాన్ చేశాడు . ఈ క్రమంలోని విశ్వక్ సేన్ హీరోగా అనుకొని అతనికి కథ చెప్పగా స్టోరీ లైన్ నచ్చిన విశ్వక్ సేన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో కొంత పారితోషకం కూడా ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది.

అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇందులో అర్జున్ కూతురు ఐశ్వర్య సర్జ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం కానుంది . ఈనెల నాలుగో తేదీన ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా .. షూటింగుకి ఒక గంట ముందు క్యాన్సిల్ చేయాలంటూ తనకు మెసేజ్ పెట్టాడని అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. అంతేకాదు అప్పటికే రెండు షెడ్యూల్స్ డేట్స్ కూడా మార్చినట్లు తెలిపాడు. దాంతో అతనికి కమిట్మెంట్ లేదంటూ విమర్శించడం మొదలుపెట్టాడు . ఈ క్రమంలోని నిర్మాత , దర్శకుడు అంటే గౌరవం లేని ఇతడిని నా సినిమా నుంచి తొలగించి ..వేరొక హీరోతో సినిమా చేస్తానని కూడా చెప్పాడు.

తాజాగా ఈ విషయం స్పందించిన విశ్వక్ సే.. తాజాగా హైదరాబాదులో జరిగిన రాజయోగం మూవీ టీజర్ లాంఛ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. తనని గుడ్డిగా నమ్మాలంటూ పదేపదే చెప్తూ ఆయన వెళ్ళాడు. దాంతో కళ్ళు మూసుకొని కాపురం చేసినట్లు అవుతుంది. అందుకే నేను సినిమా నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. అయితే మరోసారి డిస్కషన్ తర్వాత షూటింగ్ కి వెళ్దాం అనే ఉద్దేశంతో ఈరోజు షూటింగ్ ఆపమని మెసేజ్ పెట్టాను. నేను అలా చెప్పడం తప్పితే నన్ను క్షమించండి.. అంటూ విశ్వక్ సేన్ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news