చాణక్య నీతి: ఇలాంటి పరిస్థితులు వస్తే… దూరంగా వెళ్లిపోవడమే ఉత్తమం..!

-

ప్రతి సారి మనం ఆనందంగా ఉండలేము. అలానే ప్రతిసారి మనకి బాధే ఉండదు. ఒక్కొక్కసారి పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. మన జీవితంలో మనం చాలా మంది మనుషులని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అందరి స్వభావం ఒకేలా ఉండదు కాబట్టి ఎప్పుడూ కూడా తప్పులు చేయకుండా ఉండడానికి చూసుకోవాలి. ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా కొన్ని విషయాలను చెప్పారు. ఈ పరిస్థితులు కనుక ఎదురైతే చిక్కులు తప్పవని ఇటువంటి వాటి నుంచి దూరంగా వచ్చేయడమే మంచిది అని చెప్తున్నారు. మరి గొప్ప పండితుడు నైపుణ్యం ఉన్న ఆచార్య చాణక్య చెప్పిన విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.

 

శత్రువుకి దూరంగా వచ్చేయండి:

ఒక్కొక్కసారి శత్రువులు మన మీదికి వస్తూ ఉంటారు దాడి చేయడం మన మీద పోరాడడం వంటివి చేస్తూ ఉంటారు మీరు కనుక ఇలా శత్రువుని ఎదుర్కొన్నారు అంటే కచ్చితంగా వాళ్ళ నుండి దూరంగా వచ్చేయండి. లేకపోతే మీరే చిక్కుల్లో పడతారు.

హింసకి దూరంగా ఉండండి:

హింస అల్లర్లు వంటివి వచ్చినప్పుడు మీరు కనుక ముందుకు వెళ్లారంటే మీకు ప్రమాదం. ఇటువంటి సమయంలో వీలైనంత వరకు దూరంగా వెళ్లిపోండి.

నేరస్తుల జోలికి వెళ్ళకండి:

నేరస్తులు వచ్చినప్పుడు మీరు వాళ్ళకి దూరంగా ఉండండి వారికి సాయం చేయాలనుకుంటే మీరే ఇబ్బందులు పడతారని చాణక్య అంటున్నారు.

ఆర్థిక సంక్షోభం:

ఆర్థిక వ్యవస్థ క్షీణించిన ప్రదేశాన్ని వదలడం చాలా మంచిదని ఆచార చాణక్య అంటున్నారు. కొరత ఏర్పడిన చోట ఎక్కువగా ఉండలేము కాబట్టి ఇటువంటి వాటి నుండి దూరంగా వచ్చేస్తేనే మీకు మంచిదని ఆచార్య చాణక్య చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news