విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ టైటిల్ ఇదే.. గ్లింప్స్ అదిరిందిగా..?

-

మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. తాజాగా మూవీటీమ్ సినిమా టైటిల్​ పోస్టర్ అండ్ గ్లింప్స్​ను రిలీజ్ చేసింది. ఇందులో విశ్వక్​సేన్​ గోదావరి బ్రిడ్జి కింది నదిలో పడవ వేసుకుని వెళ్తూ కనిపించాడు. ఓ నలుగురుని వెంట వేసుకుని కత్తులు పట్టుకుని.. మాస్​ లుక్​లో ఉన్నాడు.

ఈ సినిమాకు ‘గ్యాంగ్స్​ ఆఫ్​ గోదావరి’ అనే టైటిల్​ను ఖరారు చేశారు. ఇక గ్లింప్స్​ లో విశ్వక్ సేన్ అదరగొట్టాడు. ‘అన్నాయ్​ మేం గోదారోళ్లాం. మాతోటే సాగదీస్తాం. తేడా వస్తే నవ్వూతూ నరాలు లాగేస్తాం’ అంటూ పవర్​ఫుల్​ వార్నింగ్​ ఇస్తూ కనిపించారు విశ్వక్. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే విశ్వక్ సేన్ దాస్ కా దమ్కీ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. మాస్ అవతార్ లో తన ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తన లేటెస్ట్ మూవీలో కూడా మాస్ లుక్ లో కనిపించడంతో ఈ సినిమాపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news