వామ్మో.. ఆ విషయంలో శ్రీముఖి ముందు స్టార్ హీరోయిన్లు కూడా పనికిరారా..?

-

బుల్లితెర రాములమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అంద చందాలతో యువతను ఉర్రూతలూగించిన ఈ ముందుగమ్మ తన యాంకరింగ్ తో అందరిని అలరిస్తూ ఉంటుంది.అలా తెలుగు రాష్ట్రాలలో చెరగని ముద్ర వేసుకుంది శ్రీముఖి. మొదట యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత సినిమాలలో కూడా నటించింది.. అలా మొదటిసారి అల్లు అర్జున్ నటించిన జులాయ్, నేను శైలజ, జెంటిల్మెన్ వంటి పలు చిత్రాలలో నటించి మెప్పించింది. అలాగే ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో హీరోయిన్గా కూడా పరిచయం అయింది.

అయితే బుల్లితెరపై సక్సెస్ అయినంతగా వెండితెర పై ఈమె విజయాన్ని పొందలేకపోయింది. దాంతో బుల్లితెరకి పరిమితం అయింది. ఇక తన ఎనర్జిటిక్ మాటలతో, పంచ్ లతో పాటు గ్లామర్ షో చేస్తూ తెగ రెచ్చిపోతుంది. అంతే కాదు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా.. గ్లామర్ క్లీన్ గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. బిగ్బాస్ వంటి రియాల్టీ షోలలో కూడా పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె అనంతరం టీవీ షోలతో మరింత బిజీగా మారిపోయింది . ప్రస్తుతం యాంకరింగ్ తో పాటు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సినిమాలలో కూడా సత్తా చాటుతుంది.

ఇక సోషల్ మీడియాలో రకరకాల గ్లామర్ ఫోటోషూట్లతో నెటిజన్లను సైతం మోహితులను చేసే ఈ ముద్దుగుమ్మ ఒక్కరోజు సంపాదన తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.. సాధారణంగా శ్రీముఖి ఏదైనా ఈవెంట్ లేదా ఒకరోజు షూటింగ్ చేస్తే కచ్చితంగా దాదాపుగా రూ.3 లక్షలకు పైగా పారితోషకం అందుకుంటుందట. అంతేకాదు స్టార్ హీరోయిన్ల సైతం ఈమె ముందు పనికిరారు అన్నట్లుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక బుల్లితెర ఇండస్ట్రీలో సుమా తర్వాత అంతటి పాపులారిటీ దక్కించుకున్న మరో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. ఏదేమైనా ఈమె రేంజ్ భారీగా పెరిగిపోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news