జాన్వి సౌత్ ఇండస్ట్రీ ఎంట్రీ పై బోనీ కపూర్ ఏమన్నారంటే.. !

అందాల భామ అతిలోకసుందరి శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్.. ధడక్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ భామ తర్వాత పలు అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరియర్ లో ముందుకు వెళుతుంది. అయితే ఇప్పటివరకు కేవలం బాలీవుడ్ చిత్రాల్లో మాత్రమే నటించిన జాన్వి.. సౌత్ సినిమాల్లో నటిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి. దీనికి తగినట్టుగానే జాన్వి సైతం అవకాశాలు వస్తే సౌత్ లో నటించడానికి తను సిద్ధమని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఈ విషయంపై బోనీకపూర్ స్పందించారు..

శ్రీదేవి సౌత్ సినిమాల్లో నటించి ఎంత మంచి పేరు సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఆమె మొదటగా సౌత్ సినిమాల్లోనే నటించి ఆ తర్వాత బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అయితే ఆమె కూతురు జాన్వి మాత్రం బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈమె దక్షిణాదిలో నటించాలని ఇప్పటికే శ్రీదేవి అభిమానులంతా కోరుకుంటూ ఉన్నారు..

అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగల్ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారంట. అందుకోసం కరణ్ జోహార్ సైతం పలు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఏవి సక్సెస్ కాలేదు. అలాగే డేట్స్ అడ్జస్ట్ కాలేని సందర్భంగా ఈ సినిమాలో తాను నటించలేనని జాన్వి తిరస్కరించినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇక కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఒక చిత్రంలో జాహ్నవి నటిస్తున్నట్టు కూడా సమాచారం.. అయితే ఈ విషయాలపైన ఇప్పటివరకు జాన్వి స్పందించలేదు. అయితే తాజాగా జాన్వీ కపూర్ కోలీవుడ్ లోకి అరంగేట్రం చేయబోతోందని లింగుస్వామి డైరెక్ట్ చేసిన ‘అవారా’ మూవీకిది సీక్వెల్ అని అయితే ఇందులో కార్తి తమన్నా కాకుండా ఆర్య జాన్వీ కపూర్ నటించనున్నారంటూ ఓ కొత్త వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై తాజాగా జాన్వీ కపూర్ తండ్రి నిర్మాత బోనీ కపూర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.. జాన్వి కపూర్ ప్రస్తుతం ఎలాంటి తమిళ సినిమాలో నటించడం లేదు ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకొని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయకండి అంటూ చెప్పుకొచ్చారు..

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?