వీక్ మైండ్ తో ఉంటే హీరోలు ట్రాప్ చేయటానికే ప్రయత్నిస్తారు.. హీరోయిన్ అర్చన

అందం, టాలెంట్ ఉన్నప్పటికీ కొందరు హీరోయిన్లు సక్సెస్ కాలేకపోతారు. అందులో చెప్పుకోవలసిన ఒక టాలీవుడ్ హీరోయిన్ అర్చన. కెరియర్ మొదట్లో మంచిగానే అవకాశాలు అందుకున్నప్పటికీ.. తర్వాత మాత్రం వెనక పడిపోయింది ఈ భామ. అయితే తాజాగా ఈమె ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి..

ఇండస్ట్రీలో తన అందంతో మెస్మరైజ్ చేసిన హీరోయిన్ అర్చన. అయితే కెరియర్ లో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఇండస్ట్రీ గురించి, తన కెరీర్ కు సంబంధించి పలు విషయాలు పంచుకుంది. అందులో ముఖ్యంగా కొన్ని క్యారెక్టర్ చేయడం వల్ల తను సినిమాల్లో అవకాశాలు కోల్పోయానని అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీ బయటకు కనిపించినట్టు ఉండదని తెలిపింది. కొందరికి హీరోలు అవకాశాల కోసం ఎదురు చూస్తారని అలాంటివారితో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది..

రాధాగోపాలం సినిమాలో అవకాశాన్ని మిస్ చేసుకున్నానని చెప్పుకొచ్చిన ఈ భామ.. ఒక సినిమాలో క్యారెక్టర్ రోల్ చేయడం వల్ల హీరోయిన్గా అవకాశాలు పోయాయని తెలిపింది. ఆ సందర్భంలోనే తనకు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో పూర్తిగా అర్థమైందని చెప్పుకొచ్చింది.. రాధాగోపాలం సినిమాలో నటించి ఉంటే తన కెరీర్ అద్భుతంగా ఉండి ఉండేదని తెలిపింది. అంతేకాకుండా కొంతమంది హీరోయిన్లు క్యారెక్టర్స్ రోల్లో కనిపించే సైతం సక్సెస్ అయ్యారని కానీ తాను మాత్రం అలా చేసి సినీ కెరీర్ ను దెబ్బ తీసుకున్నానని చెప్పుకొచ్చింది.. అలాగే తాను ఎక్కడికి వెళ్లినా తెలుగు వాళ్ళు కనిపిస్తూ ఉంటారని వాళ్లంతా మళ్ళీ మీరు తెలుగు సినిమాల్లో నటించండని చెబుతూ ఉంటారని తెలిపింది.. అలాగే యమదొంగలో తాను నటించిన క్యారెక్టర్ మంచి పేరు తెచ్చిందని ప్రస్తుతం కొన్ని ఆఫర్లు వస్తున్నాయని నటించడానికి ఆలోచిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రంగస్థలం సినిమాలో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్ర తనను ఎంతగానో మెస్మరైజ్ చేసినట్టు చెప్పుకొచ్చింది..

అలాగే సినీ ఇండస్ట్రీలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చిన అర్చన ఒక అమ్మాయి కొంచెం అజాగ్రత్తగా ఉన్నా చాలామంది ఆ అమ్మాయిని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తారని తెలిపింది. అంతేకాకుండా ఒక హీరో తనకు తెలియకుండానే తన గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారని.. ఆ హీరోది వంకర బుద్ధి అంటూ తెలిపింది.. అలాగే సినీ ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ లేని అందంగా ఉన్న అమ్మాయిలను కొంతమంది హీరోలు ట్రాప్ చేస్తారని చెప్పుకొచ్చింది. మనకు ఏది మంచో ఏది చెడో తెలియకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని అయితే తనకు తల్లిదండ్రుల సపోర్ట్ పూర్తిగా ఉందంటూ చెప్పకు వచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?