మెక్ డొనాల్డ్ యాడ్ కోసం ఎన్టీఆర్ పారితోషకం ఎంతంటే..?

-

ప్రముఖ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సినిమాలు, మరొకవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఇక ఈయన చేసే సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతూ మరింత పాపులారిటీని అందిస్తున్నాయి.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.80 కోట్ల రేంజ్ లో పారితోషకం అందుకుంటున్న ఎన్టీఆర్ కమర్షియల్ యాడ్స్ కోసం కూడా బాగానే తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇకపోతే బుల్లితెర షోలు కూడా చేసిన ఈయన మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ వంటి షోలకు హోస్టుగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు తాజాగా మరొక ఫుడ్ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం జరిగింది. చాలా రోజుల క్రితం ఈ యాడ్ షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఇటీవలే రిలీజ్ చేశారు మెక్ డొనాల్డ్స్ వారు. తాజాగా అందులో ఎన్టీఆర్ స్మార్ట్ లుక్కుతో కనిపించడం చూడవచ్చు. చికెన్ స్పైసీ అంటూ ఎన్టీఆర్ చేసిన ఈ యాడ్ మెక్ డోనాల్డ్స్ వారికి బాగా కమర్షియల్ గా కలిసి వచ్చిందని చెప్పాలి. అయితే ఈ యాడ్ కోసం ఎన్టీఆర్ ఎంత పారితోషకం తీసుకున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇకపోతే ఈ యాడ్ కోసం ఆయన ఏకంగా రూ .8 కోట్లు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఈయన సినిమాల విషయానికి వస్తే కొరటాల శివతో దేవర అనే సినిమా చేస్తూ షూటింగ్లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో ఆయన ఒక సినిమా చేయనున్నారు. ఇక ఈ సినిమా కూడా పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో గరుడ అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యారు ఎన్టీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news