రాజమౌళి సినిమాలలో తన భార్యకు నచ్చని సినిమా ఏదంటే..?

-

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమా కోసం ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈయన తెరకెక్కించే ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా మరింత పాపులారిటీని అందిస్తూ ఉంటుంది.. అందుకే రాజమౌళి సినిమాలు ఎల్లలు దాటుతూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇలాంటి రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా ఒక ఆణిముత్యం లాంటిది అని చెప్పవచ్చు.. కానీ రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో ఒక సినిమా అంటే ఆయన సతీమణి రమా రాజమౌళికి ఇష్టం లేదట.

అసలు విషయంలోకి వెళితే.. రాజమౌళి ఇప్పటివరకు కేవలం 13 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. అందులోనూ ఎక్కువగా ఎన్టీఆర్ తోనే సినిమాలు చేయడం జరిగింది. ఇప్పటివరకు రాజమౌళి ఎన్టీఆర్ తో నాలుగు సినిమాలు చేయగా అందులో ఒక సినిమా రాజమౌళి భార్య రమా రాజమౌళికి నచ్చలేదట. ఆ సినిమా ఏదో కాదు యమదొంగ సినిమా అంటే ఆమెకు నచ్చదు అని రాజమౌళి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. యమదొంగ సినిమా డైరెక్షన్ తనకు అంతగా నచ్చలేదని.. అయితే కారణం తెలియదు కానీ ఆ సినిమా తనకు ఇష్టం లేదని రమా తెలియజేసినట్టుగా రాజమౌళి తెలిపారు.

ముఖ్యంగా యమదొంగ సినిమా విషయంలో రాజమౌళి పాత్ర ఏమీ లేదు అని.. ఎన్టీఆర్ వల్లే సినిమా నిలబడింది అని తన అభిప్రాయంగా రమా రాజమౌళి వెల్లడించినట్లు సమాచారం. ఇకపోతే రమా రాజమౌళి తరఫున రాజమౌళి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news