హీరోయిన్ రక్షిత ఇలా అవ్వడానికి .. కారణం అదేనా..?

-

సినిమాల ఉన్నంత వరకు హీరోయిన్స్ కి తన ఫిజిక్ తో పాటు గ్లామర్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. అలా ఉండడం కోసం ఎన్నో కసరత్తులు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే వివాహం చేసుకొని ఎప్పుడైతే సినిమాలకు గుడ్బై చెబుతారో.. ఆ తర్వాత వారిని గుర్తుపట్టలేనంతగా మారి పోతూ ఉంటారు. గతంలో ఇలా ఎంతో మంది హీరోయిన్స్ విషయంలో ఇలానే జరిగింది. ఇక ఇప్పుడు రవితేజతో కలిసి ఇడియట్ సినిమా లో నటించిన హీరోయిన్ రక్షిత పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది. ఆమెను ఇప్పుడు చూస్తే అంత ఈజీ గా ఎవరు గుర్తుపట్టలేక పోతున్నారు.Mahesh Babu actress goes unrecognized

ఇడియట్ సినిమా లో రక్షిత పాత్ర సూపర్ గా నటించినప్పటికీ హీరో ని తన వైపు తిప్పుకునేలా రక్షిత మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత రక్షిత , మహేష్ బాబు , నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించింది. ఇక ఆ తరవాత కన్నడలో కూడా కొన్ని సినిమాలలో నటించినప్పటికీ బాగానే ఆకట్టుకున్నాయి. ఈమె అసలు పేరు శ్వేత. రక్షిత జన్మించింది బెంగళూరులో. ఇక ఈమె తండ్రి బిసి గౌరీశంకర్ కొరియోగ్రాఫర్. ఈమె తల్లి కూడా మమతా రావు కన్నడ నటి. ఇక వీరిద్దరూ కూడా ఇండస్ట్రీలో ఉండడంతో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు చాలా సులువుగా అయ్యింది.Happy Birthday Rakshita: Actress celebrates her 36th birthday with family | Kannada Movie News - Times of Indiaఈమె డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఆఫర్లు రావడంతో కన్నడలో హీరో పునీత్ రాజ్ కుమార్ తో కలిసి నటించింది. కన్నడ లో టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న నాగార్జునతో కలిసి శివమణి , మహేష్ తో నిజం, ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా తదితర హీరోలతో కలిసి నటించింది. ఇక్కడ కూడా కెరియర్ పరంగా బాగానే దూసుకుపోయిన ఈమె కనడ డైరెక్టర్ ప్రేమ ని ప్రేమించి వివాహం చేసుకుంది. దాంతో ఈమె సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. అయితే ఈమెకు కొడుకు పుట్టాక తైరాయిడ్ సమస్య రావడంతో తన బరువెక్కి నట్టుగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ప్రస్తుతం కన్నడ లో పలు షోలకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక ఈమె ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కూడా కొనసాగుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news