RRR Heroine : అసలు ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్..!

-

రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల మల్టీస్టారర్‌ RRR మూవీలో నటిస్తున్న డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఇది..

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాకు సంబందించి ఈరోజు ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. సినిమాకు కథతో పాటుగా హీరోయిన్స్ మిగతా కాస్ట్ కూడా రివీల్ చేశారు. ఆర్.ఆర్.ఆర్ ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి ఎవరికి తోచిన కథని వారు చెప్పేస్తున్నారు.

అందుకే ఇలా వదిలేస్తే కష్టమని ప్రెస్ మీట్ పెట్టి మరి ఎన్.టి.ఆర్, రాం చరణ్ రియల్ హీరోస్ పాత్రల్లో కనిపిస్తున్నారని వెళ్లడించారు. ఇక ఆర్.ఆర్.ఆర్ లో హీరోయిన్స్ గా అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ ను సెలెక్ట్ చేశారు. అయితే బాలీవుడ్ లో అలియా చేస్తున్న సినిమాలు.. ఆమె ప్రతిభ గురించి తెలుసు.. కాని సడెన్ గా డైసీ ఎడ్గర్ జోన్స్ గురించి అందరు ఆరా తీస్తున్నారు.

బ్రిటీష్ నటి అయిన ఎడ్గర్ జోన్స్ బ్రిటన్ లో పలు సీరియల్స్ లో నటిస్తుంది. టివి షోలతో బాగా ఫేమస్ అయిన వారిలో ఎడ్గర్ జోన్స్ ఒకరు. సైలెంట్ విట్నెస్, కోల్డ్ ఫీట్ వంటి టివి సీరీస్ లలో డైసీ ఎడ్గర్ జోన్స్ నటన ఆకట్టుకుంది. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఎడ్గర్ జోన్స్ పాండ్ లైఫ్ అనే సినిమాలో కూడా నటించింది. ఆమె ప్రతిభ చూసి ఇంప్రెస్ అయిన రాజమౌళి ఆమెను తెలుగు ప్రేక్షకుల కోసం తీసుకొస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news