బిగ్ బాస్ లో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. విశ్వరూపం చూపించిన గంగవ్వ!

-

గత సీజన్లకు భిన్నంగా మొదటివారం రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ సాధించిన బిగ్ బాస్ షోకు రెండో వారంలోనే షాక్ తగిలింది. తొలి వారంతో పోలిస్తే రెండో వారం బిగ్ బాస్ రేటింగ్స్ భారీగా తగ్గాయి. మరీ సీరియళ్ల స్థాయిలో బిగ్ బాస్ రేటింగ్స్ వస్తూ ఉండటం గమనార్హం. నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే రోబోల టీమ్, మనుషుల టీమ్ మధ్య జరిగిన టాస్కులో రోబోల టీమ్ విజయం సాధించింది.

బుద్ధిబలంతో రోబోల టీమ్ మనుషుల టీమ్ ను ఓడించింది. రోబోల టీమ్ కు చెందిన అవినాష్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ దగ్గర అతనికి తెలియకుండా ఛార్జింగ్ పెట్టుకున్నాడు. దీంతో ఎప్పుడూ కూల్ గా కనిపించే మాస్టర్ చాలా సీరియస్ అయ్యాడు. జీవితంలో నాశనం అయిపోతావంటూ.. జన్మజన్మలు నాతో మాట్లాడొద్దంటూ మాస్టర్ శాపనార్థాలు పెట్టాడు ఆ తర్వాత మోనాల్ గంగవ్వ వేసుకున్న రోబో డ్రెస్ ను విసిరేసింది.

దీంతో గంగవ్వ తీవ్ర ఆగ్రహానికి గురై మోనాల్ పై కోపాన్ని వెళ్లగక్కింది. ఆహారం ఇస్తే చార్జింగ్ ఇస్తామని గంగవ్వకు మనుషుల టీమ్ చెప్పి ఆహారం తీసుకొని చార్జింగ్ ఇచ్చారు. అభి, గంగవ్వల దగ్గర ఛార్జింగ్ ఉండటంతో టాస్క్ ముగిసిందని రోబోల టీమ్ విన్ అయిందని బిగ్ బాస్ తెలిపాడు. రోబోల టీమ్ నుంచి కెప్టెన్సీ కోసం గంగ‌వ్వ‌, హారిక‌, అభిజిత్, అవినాష్ పోటీ చేయగా గంగవ్వ విన్ కావచ్చని వార్తలు వస్తున్నాయి.

మనుషుల టీమ్ లోని సభ్యులు నోయల్ చెత్త ఫెర్ఫామెన్స్ ఇచ్చాడని ముక్త కంఠంతో చెప్పారు. దీంతో బిగ్ బాస్ నోయల్ కు జైలు శిక్ష విధించాడు. నోయల్ కు రాగిజావ మాత్రమే అది తప్ప ఇంకేం ఇవ్వకూడదని తెలిపాడు. బిగ్ బాస్ హౌస్ లోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందని తెలిసేలా ప్రోమో వదిలాదు. ఈరోజు బిగ్ బాస్ హౌస్ లోకి స్వాతి దీక్షిత్ ఎంట్రీ ఇవ్వనుంది. జంప్ జిలానీ, బ్రేకప్, చిత్రాంగద సినిమాల్లోని పాత్రల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న స్వాతి దీక్ష్తిత్ ఏ మేరకు ప్రేక్షకులను అకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version