యంగ్ లీడింగ్ హీరోలకు శింబు ధమ్కీ ఇస్తాడా..?

Join Our COmmunity

కోలీవుడ్ కుర్రహీరో శింబు గేర్ మార్చాడు.అయిపోయిందనుకున్న కెరియర్ ను కరెక్ట్ ట్రాక్ లోకి తీసుకువస్తున్నాడు. డిసిప్లిన్ లేకపోవడంతో సైడైపోయిన ఈ తమిళ తంబీ త్వరలో లీడింగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా తన సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. తాజాగా తన కొత్త సినిమా “మానాడు” పోస్టర్ తో హల్చల్ చేస్తున్న ఈ యంగ్ తరంగ్ పై కోలీవుడ్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.

కోలీవుడ్ కుర్రహీరోలకున్న పోటీ…. సౌత్ లో ఏ పరిశ్రమలోను కనిపించదు.స్వింగ్ లో ఉన్నప్పుడే ఇక్కడి హీరోలు ఐదారు హిట్లు ఇచ్చేస్తారు.ఆతర్వాత రెమ్యునిరేషన్ పెంచేసి ర్యాంక్ పెరిగిందంటూ హల్చల్ చేస్తారు.అయితే ఈ కల్చర్ ను ఇప్పుడు ఫామ్ లో ఉన్న యంగ్ హీరోలందరికంటే ముందుగానే స్టార్ట్ చేసిన హీరో శింబునే.వరుస ప్రయోగాలు,రొమాంటిక్ యాక్షన్ వెంచర్లు చేసి యూత్ లో ఎక్కువ ఫోకస్ అయ్యాడు.

శింబు యంగ్ హీరోలలో టాప్ కు వెళ్తున్న టైమ్లో అనవసర గొడవలు,పార్టీలు,లవ్ స్టోరీలతో తన కెరియర్ ను స్పాయిల్ చేసుకున్నాడు.వీటితో పాటు పరిశ్రమలో డిసిప్లిన్ లేకపోవడంతో షేపవుట్ అయిపోయి అటు యాక్షన్ ,ఇటు రొమాంటిక్ ఫిలింస్ కు కాకుండా అయిపోయాడు.ఐతే గత కొంతకాలంగా శింబు యాక్టింగ్ పై సీరియస్ గా దృష్టి పెడుతున్నాడు.తనని తాను షేప్ చేసుకుంటూ మునుపటి రూపాన్ని తెచ్చుకున్నాడు.అక్కడితో ఊరుకోకుండా లీడింగ్ హీరోలకు పోటీగా సినిమాలను రూపొందిస్తున్నాడు.తాజాగా ఈశ్వరన్ ,మానాడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈరెండు ప్రాజెక్ట్ లు తనకు పూర్వవైభవాన్ని తెస్తాయని ఆశపడుతున్నాడు.

శింబు గత కొన్ని రోజులుగా తన అప్ కమింగ్ ఫిలిం “మానాడు” పోస్టర్లతో ట్రెండ్ లో ఉన్నాడు.ఈ పిక్స్ లో శింబు లుక్ చూసినవారికి మనోడు మళ్లీ లైమ్లో లైట్లోకి రావడం ఖాయమంటున్నారు.గతంలో తనకు ఎంతో పోటీ ఇచ్చి సైడ్ చేసిన ధనుష్ ను ఈసారి తాను సైడ్ చేస్తానని ధీమాగా చెబుతున్నాడు.ఒకే ఒక్క పోస్టర్ తో శింబుకు అతనికి ఫ్యాన్స్ కు ఎక్కడలేని ఎనర్జీ వచ్చేసింది.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news