పొన్నియన్ సెల్వన్ సినిమాకి సీక్వెల్ ఉంటుందా..?

-

దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ నిన్నటి రోజు విడుదలైంది. ఇక ఈ సినిమాని 30 ఏళ్లుగా తన డ్రీమ్ ప్రాజెక్టుగా పేర్కొన్నారు మణిరత్నం. ఇక ఈ చిత్రాన్ని ఎంతో మంది స్టార్ హీరోలతో చేయాలని ప్రయత్నించినా చివరికి తమిళ నటులతోనే ఈ సినిమాని తెరకెక్కించారు మణిరత్నం. ఇందులో విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష జయం రవి, కార్తీ, ప్రకాష్ రాజ్, తదితర నటీనటులు నటించారు.పొన్నియన్ సెల్వన్-1 చిత్రాన్ని భారీ స్థాయిలో నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. దీంతో తమిళ ప్రేక్షకుల నుంచి మా చిత్రం బాహుబలి కంటే మించిపోతుంది అంటూ చాలా హడావిడి చేయడం మొదలుపెట్టారు.

అయితే ఈ చిత్రం తమిళనాడులో తప్ప మరెక్కడ అంతగా బజ్ ఏర్పడలేదని చెప్పవచ్చు.. తెలుగులో డైరెక్టర్ మణిరత్నం చిత్రాలకు మంచి క్రేజ్ ఉంటుంది కానీ ఈ సినిమాకి మాత్రం అంతగా కనిపించలేదు. తమిళంలో బాగా పాపులర్ అయిన రైటర్ కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీని ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రేక్షకులకు మరింత ఆసక్తిని కలిగించింది. అయితే ఈ సినిమా సగటు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది అని వార్తలు వినిపిస్తున్నాయి.

పొన్నియన్ సెల్వన్-1 చిత్రాన్ని చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇలానే చెబుతున్నారు. ఈ చిత్రం కోసం మణిరత్నం చిత్ర బృందం పెద్దగా ఎక్కడ హార్డ్ వర్క్ చేయలేదు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథను మధ్యలో మొదలుపెట్టి అసంపూర్తిగా వదిలేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నటించిన నటులకు సగటు ప్రేక్షకులు కూడా పెద్దగా కనెక్ట్ అవ్వలేదని సమాచారం. ఇక ఇలాంటి సినిమాలకు కావలసిన ఎమోషన్స్, వంటి సన్నివేశాలు ఎక్కడ కనిపించలేదని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో కేవలం కార్తీ పాత్రకు తప్ప మరే ఇతర పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ మొదటి భాగం చూశాక చిత్ర బృందం పార్ట్-2 ని మొదలుపెట్టే ధైర్యం చేస్తారా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి కలుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news