‘వరల్డ్ ఫేమస్ లవర్’ పబ్లిక్‌ టాక్..!!

క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని సినిమాకి పెద్ద హడావిడి చేయలేదు. ఎందుకంటే గతంలో విజయ్ దేవరకొండ నటించిన సినిమాల ప్రమోషన్ సమయంలో స్టేజీల పై బీభత్సమైన స్పీచ్ లు ఇవ్వడం జరిగింది. Image result for ‘వరల్డ్ ఫేమస్ లవర్’

తీరా సినిమా రిలీజయ్యాక సినిమాకి ప్లాప్ టాక్ రావడంతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ని భయంకరంగా ట్రోలింగ్ చేయడం జరిగింది. దీంతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా విషయంలో ఏమాత్రం అతిగా ప్రవర్తించకుండా సినిమా ప్రమోషన్స్ చాలా సైలెంట్ గా కానించి ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది. ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది.

సినిమా చూసిన ఆడియన్స్ చాలా మంది వాలెంటైన్స్ డే నాడు ఇలాంటి సినిమా తీయడం ఏంటి అసలు బాగోలేదు అని కొందరు అంటుంటే మరికొందరు పర్లేదు అని అంటున్నారు. చాలా వరకు సినిమాలో సెకండాఫ్ సినిమాకి మైనస్ అని కామెంట్ చేస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ కి ఈ సినిమాతో బ్రేక్ వస్తుందని ఫ్యాన్స్ భావించారు. నలుగురు హీరోయిన్లతో కలిసి లవ్ స్టోరీ చేసిన విజయ్ దేవరకొండ కి సక్సెస్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఈ సినిమాకి వస్తున్న టాక్ చూసి నిరుత్సాహం పడుతున్నారు. అయితే సినిమాలో విషయం లేకపోవడంతో పాటు నెగిటివ్ టాక్ ముందే రావడంతో మొత్తం మీద కమర్షియల్ గా సినిమా సక్సెస్ కాదని చూసిన ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.