వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ మీ జీ సినిమాలులో!

-

హైదరాబాద్, 12 ఏప్రిల్: వైవిధ్యభరితమైన సినిమాలతో ప్రేక్షకులకు వినోదం పంచే జీ సినిమాలు మరో సందేశాత్మక చిత్రంతో మీ ముందుకు రావడానికి సిద్దంగా ఉంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించే జీ సినిమాలు ఈసారి మరో సరికొత్త చిత్రంతో రాబోతోంది. ఆలోచనాత్మక చిత్రంగా ప్రశంసలు పొందిన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ సినిమా ఈ శుక్రవారం ఏప్రిల్ 14న, మధ్యాహ్నం 12 గంటలకు మీ జీ సినిమాలులో ప్రసారం కానుంది.

ఈ చిత్రం కథ కొత్తగా పెళ్లి జరిగిన ఓ భారతీయ మహిళ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించింది. ఎన్నో ఆశయాలు, ఆలోచనలతో కూడిన ఓ మహిళ జీవితం పెళ్ళి జరిగి ఆమె భర్త ఇంటికి వెళ్లిన తర్వాత ఎలా మారుతుందనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు. భర్త ఇంట్లో మహిళల స్థానం ఏంటనేది గ్రహించిన ఇల్లాలిగా ఐశ్వర్య చక్కగా నటించారు. ఆధునిక భారతీయ సమాజంలోనూ పితృస్వామ్యం ఎంతగా వేళ్లూనుకుందో ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంఇ. పెళ్లితోనే మొదలయ్యే సినిమాలో కాసేపటికే భారత మహిళల జీవితాలు ఎలా వంటింట్లో మగ్గిపోతున్నాయో చక్కగా తెలుపుతుంది. ఆర్ కణ్ణన్ దర్శకత్వం వహించిన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ సినిమా సందేశాత్మక చిత్రంగా ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు పొందింది.

 

ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించగా యోగిబాబు తన కామెడీతో నవ్వులు పూయించారు. ఈ సినిమాని మీరూ మిస్ అవకుండా చూడండి, మీ జీ సినిమాలులో! ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి, విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం, ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ ఏప్రిల్ 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు, జీ సినిమాలులో మాత్రమే, తప్పక చూడండి!

Read more RELATED
Recommended to you

Latest news