వావ్; కోటిన్నర బీఎండబ్ల్యూ కారుని విలన్ కు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో…!

-

కన్నడ సిని పరిశ్రమలో స్టార్ హీరో గా నటిస్తూనే ఇతర భాషల్లో విలన్ గా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు కిచ్చా సుదీప్. ఈగ సినిమా ద్వారా జాతీయ స్థాయిలో పాపులర్ అయిన సుదీప్ ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బాలివుడ్ లో కూడా మంచి సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నాడు.

తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన దబాంగ్‌ 3లో విలన్‌గా నటించి మెప్పించాడు సుధీప్‌. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చుల్‌పాండే పాత్రలో సల్మాన్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోగా సుదీప్ విలన్ గా సక్సెస్ అయ్యాడు. తన స్టైల్ తో బాలివుడ్ ఫాన్స్ కి దగ్గరయ్యాడు సుదీప్. డిసెంబర్ లో విడుదల అయినా ఈ సినిమా మంచి విజయం సాధించింది.

ఇక సుదీప్ సల్మాన్ ఖాన్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేసాడు. తనకు నచ్చిన వారికి మంచి గిఫ్ట్ లు ఇచ్చే అలవాటు ఉన్న సల్మాన్ ఖాన్ తనకు విలన్ గా నటించిన సుదీప్ కు ఓ కాస్ట్లీ గిఫ్ట్‌ ఇచ్చాడు. దాదాపు కోటిన్నర ఖరీదు చేసే బీఎండబ్ల్యూ కారును సుధీప్‌కు బహుమతిగా అందించాడు. ఈ కారు స్వయంగా సల్మానే, సుధీప్‌ ఇంటికి తీసుకెళ్లి ఇవ్వటం విశేషం. సల్మాన్‌ తనపై చూపించిన ప్రేమకు పొంగిపోయిన సుధీప్‌,

ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియా పేజ్‌ ద్వారా విషయాన్ని బయటపెట్టాడు సుదీప్. “మనం మంచి చేస్తే మనకు మంచే జరుగుతుంది. సల్మాన్‌ సార్‌ ఈ గిఫ్ట్‌తో ఈ సూత్రాన్ని మరింతకాలం నమ్మేలా చేశారు. బీఎండబ్ల్యూ ఎం5, స్వీట్‌ గెస్చర్‌. నా మీద నా కుటుంబం మీద చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞడ్ని సార్. మీరు ఇలా మా దగ్గరకి రావటం, మీతో నేను కలిసి నటించటం నాకెంతో గర్వంగా ఉంది” అని పోస్ట్ చేసాడు సుదీప్.

Read more RELATED
Recommended to you

Latest news