రాఖీ భాయ్ రొమాంటిక్ అవతార్..పూజా హెగ్డేతో రొమాన్స్?

కన్నడ హీరో రాకింగ్ స్టార్ యశ్ KGF చాప్టర్1,2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. బాక్సాఫీస్ కా బాప్ రాఖీ భాయ్ అని అనిపించుకున్నారు. ప్రశాంత్ నీల్-యశ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ చేస్తున్నారు.

యశ్ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి? అని అభిమానులు ఎదురు చూస్తున్న క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం..ఈ సారి కూడా యశ్ ..పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నారు. కన్నడ డైరెక్టర్ నర్తన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఇది రొమాంటిక్ లవ్ స్టోరి అని వార్తలొస్తున్నాయి.

అలా రాఖీ భాయ్ ఇందులో నయా అవతార్ లో కనిపిస్తారని టాక్. అయితే, యాక్షన్ సీక్వెన్సెస్ పైన డెఫినెట్ గా ఫోకస్ ఉంటుందనే వాదన కూడా వినబడుతోంది. ఇందులో హీరోయిన్ గా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఫైనల్ అయినట్లు టాక్. పూజా హెగ్డేతో రొమాంటిక్ సీన్స్ ను డైరెక్టర్ చాలా చక్కగా ప్లాన్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. అలా మొత్తంగా పూజా హెగ్డే …యశ్ తో చేయబోయే ఫిల్మ్ ద్వారా శాండల్ వుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నది.