Yashoda: సమంత చిత్రం నిలిపివేయాలని కేసు ఫైల్..?

-

హీరోయిన్ సమంత తాజాగా లేడీ ఓరియంటెడ్ చిత్రంగా వచ్చిన చిత్రం యశోద. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి మంచి సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్ తో ఈ సినిమా సేఫ్ జోన్ లో అయితే కొనసాగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదల ప్రమోషన్లలో సమంత కూడా పెద్దగా పాల్గొనలేకపోయింది. కారణం సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం చేత చిత్ర యూనిట్ కూడా సమంత లేకుండా ఈ సినిమాని ప్రమోషన్ చేయడం జరిగింది. సమంత సోషల్ మీడియా ద్వారానే ఈ సినిమా గురించి అప్పుడప్పుడు తెలియజేస్తూ వస్తోంది.

ఈ సినిమా థియేటర్లలో ప్రసారమవుతున్నప్పుడే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నట్లుగా ఒక హాస్పెటల్ యాజమాన్యం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని ఓటీటి లో ఎట్టి పరిస్థితిలో విడుదల చేయకూడదని డిసెంబర్ 19న విడుదల చేయబోతున్నట్లు టాక్ రావడంతో ఈ విషయంలో సివిల్ కోర్టులో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే అందుకు గల కారణం ఏమిటంటే.. “ఇవా “హాస్పిటల్ ప్రతిష్ట దెబ్బతినేలా కొన్ని సన్నివేశాలు చూపించారని హస్పటల్ యాజమాన్యం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.

దీంతో సిటీ సివిల్ కోర్ట్ ఈ చిత్రాన్ని ఓటీటిలో విడుదల చేయడానికి వీలులేదని ఆదేశాలను కూడా జారీ చేసింది. దీంతో ఇప్పుడు ఓటిటి సంస్థ, నిర్మాతల మధ్య సరికొత్త వివాదం తలెత్తుతోంది. ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం సమయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిత్రాన్ని ఓటీటిలో విడుదల చేసే విధంగా నిర్మాతలు సిద్ధంగా ఉండాలి కానీ ఇప్పుడు వారి కారణంగా కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఓటీటి సంస్థకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఓటీటి డీల్ లో కోత విధించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news