సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద. హరి – హరీశ్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం (నవంబర్ 11న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా ఏకంగా ఐదు భాషల్లో ఈరోజు రిలీజ్ చేశారు. ఈ సినిమాని హరి- హరీష్ దర్శకత్వంలో సరోగసి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించారు. ‘ఓ బేబీ’ తర్వాత సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో సమంతకి థియేటర్ల వద్ద అభిమానులు పెద్ద ఎత్తున కటౌట్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం.
శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటించారు. ఫైట్ మాస్టర్ వెంకట్ పర్యవేక్షణలో సమంత చేసిన స్టన్స్ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయని నెటిజన్లు చెప్తున్నారు. నార్త్ అమెరికాలో గురువారం రాత్రి ‘యశోద’ ప్రీమియర్స్ వేశారు. దాంతో సినిమా చూసిన వారు ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలు చెప్తున్నారు.
ప్రేక్షకులు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన రివ్యూల ప్రకారం సినిమా ఎలా ఉందంటే.. సమంత లీడ్ రోల్ మాత్రమే కాదు.. సినిమాకి బ్యాక్ బోన్ అని చెబుతున్నారు. అటు అమాయకంగా కనిపిస్తూనే.. యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టిందని కామెంట్ చేస్తున్నారు. హరి- హరీష్ సినిమాని తెరకెక్కించిన విధాన్నాన్ని సర్వత్రా మెచ్చుకుంటున్నారు.
#Yashoda Decent 1st Half!
Interesting storyline and setup with a good pre-interval to interval sequence. Good setup for the 2nd half.
— Venky Reviews (@venkyreviews) November 11, 2022
ప్రెగ్నెన్సీ, తల్లి ప్రేమ వంటి వాటికి సంబంధించిన సీన్స్ లో డైలాగ్స్ చాలా డెప్త్ గా ఉన్నాయంటున్నారు. ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా తమ పాత్రల్లో బాగా నటించారంటున్నారు.
#Yashoda A Satisfactory Emotional Thriller that works for the most part
Interesting story/setup that is told in a partly engaging way. Twists were decent but payoffs should’ve been better along with the climax portion. Samantha gave a great performance. Decent!
Rating: 2.75-3/5
— Venky Reviews (@venkyreviews) November 11, 2022
మణిశర్మ మ్యూజిక్- బ్యాగ్రౌండ్ స్కోర్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. మొత్తానికి అమెరికాలో ఉన్న అభిమానులను యశోద సినిమా బాగానే అలరించింది. మరి.. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఈ సినిమాపై ఎలా రెస్పాండ్ అవుతారో చూడాల్సి ఉంది.
#Yashoda A Satisfactory Emotional Thriller that works for the most part
Interesting story/setup that is told in a partly engaging way. Twists were decent but payoffs should’ve been better along with the climax portion. Samantha gave a great performance. Decent!
Rating: 2.75-3/5
— Venky Reviews (@venkyreviews) November 11, 2022