జబర్దస్త్ అవినాష్ బయటికి వచ్చాడు.. మరి తర్వాత ఏంటి..!?

-

జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్ బిగ్బాస్ షో తో బాగా పాపులర్ అయ్యాడు. జబర్దస్త్ లో టీం లీడర్ గా వెలుగొందుతున్న అవినాష్ నాలుగో సీజన్ లోకి అష్టకష్టాలు పడి ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం నిజం చేస్తూ బిగ్ బాస్ 4 తెలుగు నుంచి అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు. మూడు నాలుగు వారాలుగా ఈయన ఎలిమినేషన్ గురించి చర్చ జరుగుతుంది.

avinash
avinash

ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా షో లోకి ఎంటర్ అయినా అవినాష్ మంచి ఎంటర్టైనర్ గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే చాలా వారాలు నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు. ఎప్పుడైతే నామినేషన్ లో ఉన్నాడో కంట్రోల్ కోల్పోయాడు. అనవసరమైన గొడవలు కి దిగి చివరికి ఎలిమినేట్ అయ్యాడు. నామినేట్ చేస్తే అస్సలు తట్టుకోలేకపోయిన అవినాష్ రికార్డు ఇక విషయానికి వస్తే 13వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇంటి నుండి బయటకు వెళ్లడాన్ని అతను జీర్ణించుకోలేక పోతున్నాడు. తాను జీరోగా ఈ ఇంట్లోకి వచ్చానని.. బయట కూడా తనను జబర్దస్త్ లో తీసేసారని సింపతీ గేమ్ చాలా రోజుల నుంచి ఆడుతున్నాడు అవినాష్. ఇప్పుడు ఇదే అతడికి శాపమైంది. చివరికి అనుకున్నట్లుగానే అవినాష్ 13వ వారం ఎలిమినేట్ అయ్యాడు.

ఒకవేళ ఆయన నిజంగానే సేఫ్ గేమ్ కాకుండా సింపతీకి ట్రై చేయకుండా ఉండుంటే మాత్రం కచ్చితంగా మోనాల్ ఎలిమినేట్ అయ్యేది. అలా కాకుండా అవినాష్ అయ్యాడంటే దానికి కారణం ఆయన ప్రవర్తనే. ఇదిలా ఉంటే ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన తర్వాత తనకు లైఫ్ ఉండదని చెప్పిన అవినాష్.. ఇప్పుడేం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. జబర్దస్త్ లోకి నో ఎంట్రీ అని తేలడంతో నాగబాబు షోకు వస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈయన నాగబాబు బొమ్మ అదిరింది షో వాళ్ళతో మాట్లాడుకున్నాడని ప్రచారం అయితే జరుగుతుంది. మరి చూడాలిక.. అవినాష్ ఫ్యూచర్ ప్లాన్ ఏలా ఉండబోతుందో మరి.

Read more RELATED
Recommended to you

Latest news