విరాట్.. అనుష్క.. ‘జీరో’ లవ్

-

అటు క్రికెటర్ గా మంచి ఫాంలో ఉన్న విరాట్ కొహ్లి.. ఇటు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న అనుష్క శర్మ ఇద్దరు కొన్నాళ్లుగా ప్రేమించుకుని లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు. 2017 డిసెంబర్ 11న వీరి మ్యారేజ్ జరిగింది. పెళ్లి తర్వాత కూడా తమ కెరియర్ లో ఫాం ఏమాత్రం కోల్పోలేదు. ఓ పక్క విరాట్ సంచలన విజయాలతో పాటుగా వ్యక్తిగత స్కోర్ లో కూడా రికార్డులు సృష్టించగా.. నటిగా అనుష్క మరింత క్రేజ్ తెచ్చుకుంది.

2018లో సంజు, సుయి ధాగా, జీరో సినిమాల్లో నటించింది అనుష్క శర్మ. అయితే 2018 ఎండింగ్ మాత్రం ఇద్దరు జీరోతో ముగించారు. జీరోతో ముగించడం ఏంటంటే ప్రస్తుతం మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో 3వ టెస్ట్ ఆడుతున్న ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా మొదటి ఇన్నింగ్స్ 443 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేశారు. అయితే మొదటి ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా జట్టు కేవలం 151 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఫాలో ఆన్ ఛాన్స్ ఉన్నా మళ్లీ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసింది.

అయితే ఈసారి ఇండియా జట్టు బ్యాటింగ్ లో తడబడ్డది. రెండో ఇన్నింగ్స్ 106 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ ఇన్నింగ్స్ లో విరాట్ కొహ్లి డకౌట్ అయ్యాడు. అంటే జీరో మీదే అవుట్ అయ్యాడన్నమాట. ఇక జీరో సినిమాతో అనుష్క నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నా జీరో సినిమాతో ఫెయిల్ అయ్యింది. అలా 2018 ఎండింగ్ లో కూడా విరాట్, అనుష్కల్ జీరోతో ప్రేమను పంచుకున్నారు. యాదృచ్చికమే అయినా విరాట్, అనుష్కల ఈ జీరో సెంటిమెంట్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news