ఒక సినిమా హిట్ అయితే హీరో, హీరోయిన్కుఉండే క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పాలి. ఇప్పటికే ఇలాంటి జంటలు మళ్లీ మళ్లీ కలిసి పనిచేసి హిట్లు అందుకున్నాయి. ఇక ఇదే కోవలోకి వస్తున్నారు విజయ్ దేవరకొండ, రశ్మిక. వీరిద్దరి కాంబోలో వచ్చిన గీతా గోవిందం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.100కోట్లు వసూలు చేసింది. దీంతో వీరిద్దరి కాంబోలో మళ్లీ ఓ సినిమా వచ్చింది.
కామ్రేడ్ తో మళ్లీ వీరిద్దరూ కలిసి మ్యాజిక్ చేశారు. ఆవరేజ్ గా నిలిచినప్పటికీ.. ఈ జంట కెమిస్ట్రీ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ అప్పట్లో ఎన్నో రూమర్లు వినిపించాయి. వీరిద్దరూ రియల్ లైఫ్ లో రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. హీరో రక్షిత్ శెట్టితో రష్మిక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవడానికి వీరి రిలేషన్ షిప్ ఓ కారణం అని గుసగుసలు సైతం వినిపించాయి.
కానీ ఇవేవీ పట్టించుకోని వీరిద్దరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయి.. పెద్ద స్టార్లుగా ఎదిగారు. అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిశారు. కానీ సినిమా కోసం కాదండోయ్. ఓ యాడ్ కోసం. సంతూర్ ప్రొడక్ట్ కొత్త బ్రాండ్ అంబాసిడర్లు గా విజయ్, రష్మిక నియమితులయ్యారు. ఇందులో వీరిద్దరితో యాడ్ షూటింగ్ చేశారు. విజయ్ మోకాళ్లపై కూర్చొని రష్మికకు ఓ గిఫ్ట్ అందిస్తున్నట్లు ఈ యాడ్ చేశారని సమాచారం. దీంతో వీరి అభిమానులు తెగ సంబురపడి పోతున్నారు. అయితే వీరిద్దరూ మరో సినిమా చేయాలని అంతా కోరుకుంటున్నారు.