కంపెనీ నుండి ఇన్స్యూరెన్స్ ఉన్నా కూడా ప్రత్యేకంగా ఇన్స్యూరెన్స్ అవసరమా..? నిజానిజాలివే..

-

ఇన్స్యూరెన్స్ అనేది మీ మీద ఆధారపడ్డ వాళ్ళకి మీరు లేనపుడు కూడా మీరిచ్చే భరోసా. మీ తల్లిదండ్రులకి కావచ్చు, మీ పిల్లలకి కావచ్చు, మీ చుట్టాలకి కావచ్చు, మరెవరికైనా కావచ్చు. మీరు లేనపుడు కూడా వాళ్ల జీవితం బాగుండాలన్న ఉద్దేశ్యమే. ఇన్స్యూరెన్సులలో చాలా రకాలున్నాయి. టర్మ్ ప్లాన్స్, యూలిప్ ప్లాన్స్, ఇంకా చాలా. ఐతే ఏది ఎవరికి మంచిదనేది మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని అడిగి కనుక్కోండి.

ఈరోజు ఇక్కడ తెలుసుకునే విషయం ఏంటంటే, చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళకి. కంపెనీ ఇన్స్యూరెన్స్ ఇస్తుంది కదా, మళ్లీ అది కాకుండా బయట ఇన్స్యూరెన్స్ తీసుకోవడం అవసరమా అని. అవును, ఇన్స్యూరెన్స్ ఇస్తుంది నిజమే. కానీ అది ఎంతవరకు అనే విషయం తెలుసుకోవాలి. ముందుగానే చెప్పినట్టు ఇన్స్యూరెన్సులలో చాలా రకాలున్నాయి. మీకేది సూటవుతుంది? మీ కుటుంబ పరిస్థితులకు, మీపై ఆధారపడేవారికి ఏది సెట్ అవుతుందనేది మీరే ఆలోచించుకోవాలి. ఆ విషయాలు మీకే తెలుస్తాయి.

కంపెనీ నుండి వచ్చే ఇన్స్యూరెన్సులు అందరికీ ఒకేలా ఉంటాయి. కంపెనీ వారు కేవలం ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇన్స్యూరెన్స్ ఇస్తుంటారు కాబట్టి, వారికి మీ కుటుంబ పరిస్థితులు అర్థం కావు. అందువల్ల వారిచ్చే ఇన్స్యూరెన్స్ మీకు సరిపోకపోవచ్చు. అదీగాక కంపెనీలో జాబ్ పోయిందనుకోండి, అప్పుడేంటి పరిస్థితి. కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యి ఓ పదేళ్ళు పనిచేసారు. ఆ తర్వాత మానేసారు. మానేసాక కంపెనీ ఇన్స్యూరెన్స్ వర్తించదు. పదేళ్ల తర్వాత కొత్తగా తీసుకుంటారా? తీసుకోవచ్చు. కానీ, అప్పుడు మీ వయసు పెరుగుతుంది కాబట్టి ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అందుకే కంపెనీలో ఇన్స్యూరెన్స్ ఉన్నప్పటికీ మీ పరిస్థితులకి తగినట్టుగా ఇన్స్యూరెన్స్ తీసుకోవడమే ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news