ఏ ఆకులో భుజిస్తే ఏ ప్రయోజనం…? తామరాకులో భోజనం ఐశ్వర్యం

-

ఆధునికత పేరుతో మనం మన ఆచారాలను వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను కోల్పోతున్నాం. వాస్తవానికి విదేశీయుల మోజులు పాశ్చ్యత్య సంస్కృతి ముసుగులో మనం ఆరోగ్యాన్ని ఆనందాన్ని కోల్పోతున్నాం అనడానికి పలు ఉదాహరణలు ఉన్నాయి. నిత్యం మనం పొద్దునే లేచిన దగ్గర నుంచి పడుకునేవరకు అనేకం ఏరోజువు ఆరోజే తాజాగా వాడటం మన పూర్వీకుల ఆచారం. అవి కూడా ప్రకృతి సిద్ధమైనవి. వాటివల్ల ఆరోగ్యం. పర్యావరణ హితం జరిగేవి. అలాంటి వాటిలో భోజనం చేయడం గురించి తెలుసుకుందాం.. నిత్యం భోజనం చేయడానికి మన తండ్రి, తాతలు ఆకులు వాడేవారు ఎక్కువగా దీనివల్ల ఆరోగ్యంగా ఉండేవారు. ఏయే ఆకులో భోజనం చేస్తే ఏమి ఫలాలో తెలుసుకుందాం…

అరటి ఆకులు

అరటి ఆకులో భోజనం చేయడానికి పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటి ఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి. పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి. అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశంతోనే అరిటాకులో భోజనం పెడతారు.

-అరటి ఆకులో, విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు.
– తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిగి సాక్షాత్ లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది.
– బాదం ఆకులో భోజనంచేయడంవలన కఠిన హృదయులవుతారు.
– టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది.
– జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని మన పెద్దలు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news