తిరుచానూరు ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం !

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో మధ్యాహ్నం 2.00 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం రాత్రి ఆలయ ప్రాంగణంలోనే ఊంజల్సేవ నిర్వహించారు. అక్టోబరు 26వ తేదీనాడు ఆలయంలో గజ వాహనసేవ చేపడతారు. ఈ ఉత్సవాల కారణంగా ఈ 10 రోజుల పాటు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకార సేవ, అక్టోబరు 23న లక్ష్మీపూజ సేవలు రద్దయ్యాయి.

– శ్రీ