ఇలాంటి పనులు అస్సలు చెయ్యకండి.. శనిదేవుడి ఆగ్రహానికి గురవుతారు.. జాగ్రత్త…

-

గత జన్మలో మనం చేసుకున్న పాపం, పుణ్యం వల్ల మన ఖర్మ ఫలాలను అనుభవించేలా చేస్తాడు శనిదేవుడు..ఆయన కోపం అష్టకష్టాల పాలు చేస్తుంది. ఆయన మన వైపే ఉండాలంటే ఆయనను ప్రసన్నం చేసుకోవాలి..జీవితంలోని అడ్డంకులు తొలగించమని అంతా భయభక్తులతో కొలుచుకుంటారు. శని దేవుడు సూర్య పుత్రుడు. శని కర్మకు తగిన ఫలితాన్ని ఇచ్చేవాడు. సూర్య పుత్రుడైన మరో దేవత యమధర్మరాజు. యముడు మృత్యుదేవత. మరణానంతరం వారి సద్గతులను నిర్ణయిస్తాడు. శనిని ప్రసన్నం చేసుకున్న వారు తమ లక్ష్యాలను ఛేదిస్తారని నమ్మకం.

శని కరుణ పొందాలంటే కొన్ని పనులు తప్పక చెయ్యాలని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని పనులు శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగపడితే మరికొన్ని పనులు చెయ్యడం వల్ల శనికి కోపం రావచ్చు. తెలిసీ తెలియక ఇలాంటి పనులు చేసి శని ఆగ్రహానికి గురికావద్దు.. ఆ చెయ్యకూడని పనులేంటో ఇప్పుడు చూద్దాం..

*. పెద్దవారిని, నిస్సహాయులను ఎప్పుడూ అవమానించకూడదు. అగౌరవ పరచకూడదు. ఇలా చేస్తే శని వేసే దారుణమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది.

*. చేసిన అప్పు ఉద్దేశ్య పూర్వకంగా తీర్చకపోతే మీరు శని కోపానికి గురికావల్సి వస్తుంది. రుణం తీసుకున్న వారు వీలైనంత త్వరగా దాన్ని తీర్చుకోవడం మంచిది.

*. పాదాలు ఈడుస్తూ నడవడం అసలు మంచిది కాదు. ఇలా నడిచే వారిని శని అసలు వదిలిపెట్టడు. ఇలా చేస్తే తప్పనిసరిగా పూర్తవుతాయని అనిపించే పనులకు కూడా ఆటంకాలు ఏర్పడతాయి.

*. రకరకాలుగా ఆర్థిక సంక్షోభాలు చుట్టుముడుతాయి.కుర్చిలో కూర్చుని పాదాలు ఊపే అలవాటు కూడా మంచిది కాదు. ఇలా కూర్చుని అవసరం లేకుండా పాదాలు కదిపే అలవాటు అసలు మంచిది కాదు. ఈ చర్య జీవితాన్ని ఉద్రిక్త పరిచేందుకు కారణం అవుతుంది..

*.బాత్ రూములు మురికిగా పెట్టుకోవద్దు. కాస్త మురికిగా అయినా సరే వెంటనే శుభ్రం చేసుకోవాలి. లేదంటే శని ఆగ్రహానికి గురికావల్సి రావచ్చు. టాయిలెట్ ఉపయోగించిన తర్వాత మురికిగా వదిలెయ్యడం కూడా అసలు చెయ్యకూడదు.. పైన తెలిపినవి జాగ్రత్తగా పాటిస్తే చాలు..

Read more RELATED
Recommended to you

Latest news