ఎన్టీఆర్‌ తో సీఎం కేసీఆర్‌.. అలనాటి ఫోటోను షేర్‌ చేసిన విజయశాంతి

-

ఎన్టీఆర్‌ తో సీఎం కేసీఆర్‌ దిగిన.. అలనాటి ఫోటోను షేర్‌ చేశారు విజయశాంతి. నిన్నటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినట్లు ఎన్టీఆర్ గారి ప్రచారం లేక కేసీఆర్ గారు 1983లో ఓడిపోయినట్లు చెప్పుకునేది వారి నాటి ఎన్నికల పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం అన్నారు రాములమ్మ.

ఎన్టీఆర్ గారు ప్రచారం చెయ్యలేని చాలామంది టీడీపీ అభ్యర్థులు కూడా రాష్ట్రంలో గెలిచినప్పుడు, 1983 ఎన్నికలలో టీడీపీ ప్రభంజనంలో కూడా కేసీఆర్ గారు ఎందుకు గెలవలేదో…ఒక ఓటు, రెండు రాష్ట్రాలు అన్న నినాదంతో ఉన్న బీజేపీ వాదిగా… తెలంగాణను వ్యతిరేకిస్తున్నటీడీపీ అభ్యర్థులకు ప్రచారం చెయ్యనంటున్న నన్ను కేసీఆర్ గారి 1999 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధిపేటలో నా ప్రచారానికి, ఎంతో అభ్యర్థించినది కూడా ఆ 1983 భయంతోనే కావచ్చు…అంటూ చురకలు అంటించారు.

లేదా ముందు కొన్ని ఎన్నికలలో గెలిచినా, అప్పటికి ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉన్నదనే భయం కావచ్చు…సరే, ప్రచారం చేశాను, కేసీఆర్ గారు గెలిచారు. వారికి అది గుర్తు ఉండదన్నారు. మతిమరుపుకు సమాధానం సహజంగా ఉండదు, అందునా సిచ్యుయేషనల్ అమ్నీషియా గురించి ఎవ్వరూ చెప్పలేరు. దళిత సీఎం , డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, సీఎం గారు స్వయంగా దత్తత తీసుకున్న గ్రామాలు, ఇస్తాంబుల్, న్యూయార్క్ లెక్క అభివృద్ధి, కేజీ టూ పీజీ ఉచిత విద్య, 3 వేల రూపాయల నిరుద్యోగభృతి ఇట్లా ఎన్నో… గుర్తులేకపోవడం సీఎం గారి అవకాశవాదం. జ్ఞాపకం లేకపోవడం తెలంగాణ ప్రజల మరో తప్పిదం మాత్రం కారాదంటూ పోస్ట్‌ చేశారు విజయ శాంతి.

Read more RELATED
Recommended to you

Latest news