పూజల్లో నిమ్మకాయలను ఎందుకు వాడతారో తెలుసా.. ఏంటి నిజమా ?

-

మన దేశంలో నిమ్మకాయలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.. ఏదైనా కొత్త వస్తువు కొన్నా.. ఏదైనా పూజలో, వంటలకు, ఆరోగ్యం కోసం ఎన్నో వాటికి నిమ్మకాయను ప్రధానంగా భావిస్తారు..నిమ్మకాయలు ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతాయని విశ్వసిస్తారు. అందుకే వాటిని ఆయా సందర్భాల్లో విరివిగా వినియోగిస్తారు. నిమ్మకాయలో ప్రతికూల శక్తులు, చెడు కళ్ల ప్రభావాన్ని తగ్గించే శక్తి ఉంటుందని అంటారు. దేవాలయాలలో పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలను ఉంచి .. వాటిని ఇంటికి తీసుకొస్తే నెగెటివ్ పవర్స్ దూరం అవుతాయని అంటారు. అసలు నిమ్మకాయాలకు ఎందుకు ఆస్థానం ఇచ్చారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పురాణాల నిమ్మకాయ చరిత్ర వేద యుగం నాటిది. నింబాసురుడు అనే రాక్షసుడు శివుడు, బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొంది శక్తివంతుడు అయ్యాడు. ప్రజలను వేధించాడు. అతడి క్రూరమైన పనులతో కలత చెందిన ఋషి అగస్త్యుడు.. భూమిని ఆ రాక్షసుడి నుంచి రక్షించడానికి గొప్ప తపస్సు చేశాడు. నింబాసురుడిని అంతం చేయమని దుర్గా మాతను ప్రార్థించాడు. అందుకు అంగీకరించిన అమ్మవారు.. నింబాసురుడిని సంహరించి భూమిని సస్యశ్యామలం చేశారు. అందుకే అమ్మవారిని శాఖంబరీ దేవి రూపంలోనూ పూజిస్తారు..

శాఖంబరీ దేవి యొక్క దివ్యశక్తిని చూసి, తన పవిత్ర పాదాలలో స్థానం కల్పించమని ఆమెను వేడుకున్నాడు. దీంతో అమ్మవారు నింబాసురుడికి ఒక వరం ఇచ్చారు.అతను ఎల్లప్పుడూ నిమ్మకాయ రూపంలో ఆరాధించబడతాడని ప్రకటించింది. అప్పటి నుంచి నిమ్మకాయ హిందూ ఆచారాలలో నిమ్మకాయ ముఖ్యమైన భాగంగా మారిందని అంటారు. చండీమాత, కాళీమాత పూజల్లో తప్పనిసరిగా నిమ్మకాయలు సమర్పిస్తారు… అమ్మవార్లకు కోపం తగ్గుతుందని..

ఇంటిలో పూజకు వాడిన నిమ్మకాయలు పారవెయ్యవద్దు.. ప్రసాదంలా వాడుకోవాలి. అంటే అవి మనకు ఎలా ఉపయోగపడుతాయో అలా వాడాలి. రసం తీసిన తొక్కలను మొక్కలకు ఎరువు గా వేసుకోవచ్చు. నిమ్మ తొక్కలను ఎండబెట్టి పౌడర్ చేసి ముఖానికి సున్నిపిండిలా వాడుకోవచ్చు . టెంపుల్స్ లో పూజలకు ఉపయోగించే నిమ్మకాయలను వేలం వేస్తారు. ముఖ్యం గా తమిళనాడు లోని విల్లుపురం లో ప్రతి యేటా వేలం వేస్తారు.. ఆ నిమ్మకాయాల కోసం ప్రజలు ఎగబడతారు.. అందుకే వాటికి డిమాండ్ ఎక్కువ.. అది అసలు మ్యాటర్..

Read more RELATED
Recommended to you

Latest news