అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ నివాళులు అర్పించారు. స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకునేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆయన పేరు మీద జిల్లాను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు” అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. అన్ని పార్టీలు.. ఎన్నికల మూడ్ లో ఉన్నాయి. 2024లో గెలుపు లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.. కచ్చితంగా అధికారంలోకి రావలనే అహర్నిశలు శ్రమిస్తున్నాయి.
ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు జనం బాట పట్టాయి. వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల్లోనే ఉంటూ.. ప్రచార సభల మాదిరి హామీలు ఇస్తున్నాయి. ఇతర పార్టీలతో పోల్చుకుంటే వైసీపీ (YCP) మరింత దూకుడుగా వెళ్తోంది. మంత్రులు, నేతలు అంతా ప్రజల్లోనే ఉండేలా అధినేత జగన్ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇక పార్టీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) సైతం ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధయ్యారు..