సాధారణంగా చనిపోయే వారు ఉదయం పూట చనిపోతే సాయంత్రానికల్లా అంత్యక్రియలు చేసేస్తారు.కానీ చనిపోయేవారు సాయంత్రం పూట మరణిస్తే అప్పుడే అంత్యక్రియలు చేయరు. మన పూర్వం నుండి ఇలా మరణించిన వారికి ఉదయం పూట అంత్యక్రియలు చేయడం అనవయియితీగా వస్తుంది. దీనికి కారణం హిందూ సంప్రదాయం ప్రకారం ఉదయం పూట అంతిమ సంస్కారాలు నిర్వహించడం వల్ల మోక్షం లభిస్తుందని, ఆత్మ ప్రశాంతంగా స్వర్గానికి చేరుకుంటుందని నమ్ముతారు.
సాయంత్రం పూట చనిపోతే..రాత్రంతా శవాన్ని ఒంటరిగా ఉంచరు. ఎవరో ఒకరు కాపలాగా ఉంటారు.ఈ సమయంలో శవాన్ని ఒంటరిగా ఉంచితే అవి దుష్ట ఆత్మగా మారి ప్రజలను పీడించే అవకాశం ఉందని ఎవరో ఒకరు కాపలాగా వుంటారు.ఎలాంటి దుష్పరిణామాలు జరగకుండా తల దగ్గర బియ్యం పోసి దీపం ఉంచుతారు.ఇందులో మరొక విషయం ఏమిటంటే, రక్త సంబంధం వలన, లైంగిక సంబంధం వలన, కేవలం మరొకరి చేతిని పట్టుకోవడం వల్ల లేక బట్టలు మార్చుకుని ఉండడం వల్ల, చనిపోయిన వారు మరొకరి శరీరంతో రుణానుబంధాన్ని తయారుచేసుకుంటారు. అంటే ఒక రకంగా ఆత్మను పంచుకోవడం, భౌతికంగా ఏదో ఒక ఏకత్వం ఏర్పడుతుంది.
ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, సంప్రదాయకంగా, మీరు ఈ రుణానుబంధాన్ని పూర్తిగా తొలగించుకోవాలి . మరి ఈ అస్థికలను గంగలోనో, సముద్రంలోనో వీలైనంత దూరంగా వాటిని కలపాలి.దానికి కారణం, మరణించిన వారితో రుణానుబంధాన్ని పెంచుకోవడం ఇష్టంలేదని. జీవితాన్ని కొనసాగించడానికి రుణానుబంధం పరిపూర్ణంగా తెంచుకోవాలి. లేకపోతే ఈనాటి ఆధునిక సమాజాల్లో జరుగుతున్నట్టు, అది భౌతిక, మానసిక వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది. అది మానసిక, శారీరక వ్యవస్థను బలహీనపరుస్తుంది. దాని మూలంగా జరిగిన మంచిని ఆస్వాదించండానికి బదులు, మీరు బాధపడాల్సి వస్తుంది . అది మిగిలిన వారి జీవితంలో ఒక రకమైన అస్తవ్యస్తతకు దారితీస్తుంది. అందుకే చనిపోయిన వారిని ఉదయం పూట దహనం చేసి ఆస్తికలను పారే నీటిలో కలిపితే వారికి భూమిపై ఆశ వదిలి స్వర్గానికి వెళ్తారు అని మన పురాణాలూ చెబుతున్నాయి.