చికెన్‌, గుడ్డును ఒకేసారి తినకూడదట..పాలు, అరటిపండు కాంబినేషన్‌ కూడా.!!

-

చాలమందికి ఒకేసారి.. రెండు మూడు వెరైటీలతో తినడం అలవాటుగా ఉంటుంది. అలా తింటేనే వారికి సంతృప్తి.. కానీ కొన్ని ఫుడ్‌ కాంబినేషన్స్‌ చాలా డేంజర్.. ఏది పడితే అది ఎలా పడితే ఎలా తింటే.. రోగాలు చుట్టుముట్టేస్తాయి.. కొన్ని ర‌కాల ఆహారాల‌ను మాత్రం క‌లిపి తినరాదు. కొన్నిఫుడ్ కాంబినేష‌న్లు మ‌న‌కు హాని క‌లిగిస్తాయి. మ‌రి అవేంటో జర చూస్తేద్దామా..
ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను ఒకేసారి తిన‌కూడదు…ఏదైనా ఒక ఆహారాన్ని మాత్ర‌మే ఒకేసారి తినాలి. అంటే కోడిగుడ్లు, చికెన్‌, మ‌ట‌న్‌, పాలు, ప‌ప్పు దినుసులు.. ఇలా వీటిలో ఏది తిన్నా ఒకే ఆహారాన్ని తినాలి. రెండు మూడు కలిపి ఒకేసారి తినకూడదు.. తింటే గుడ్ల‌ను మాత్ర‌మే తినాలి..
లేదా చికెన్ తినాలి. అంతేకానీ రెండింటినీ క‌లిపి తిన‌రాదు. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని క‌లిపి తీసుకుంటే జీర్ణ‌వ్య‌వ‌స్థ‌పై భారం ప‌డుతుంది. అజీర్తి, గ్యాస్‌, అసిడిటీ వ‌స్తాయి. కాబ‌ట్టి ఈ ఆహారాల‌ను క‌లిపి తీసుకోరాదు.
పాలు, నిమ్మ జాతికి చెందిన పండ్ల‌ను కూడా ఒకేసారి తీసుకోకూడదు…అలా తీసుకుంటే గ్యాస్‌, గుండెల్లో మంట వ‌స్తాయి. రెండింటికీ మ‌ధ్య క‌నీసం 1 గంట వ్య‌వ‌ధి అయినా ఉండేలా చూసుకోవాలి.
పాలు, అర‌టి పండ్ల‌ను క‌లిపి కొంద‌రు మిల్క్ షేక్‌లా చేసుకుంటారు.. ఇది టేస్టీగానే ఉంటుంది కానీ.. ఇలా అస్స‌లు చేయ‌రాదు. ఎందుకంటే ఈ కాంబినేష‌న్ జీర్ణం అయ్యేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. జీర్ణ‌శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారికి గ్యాస్, అజీర్ణం వ‌స్తాయి.
కొంద‌రు శీత‌ల పానీయాల‌ను భిన్న ర‌కాల ఆహారాల‌తో తాగుతుంటారు. ముఖ్యంగా బిర్యానీ విత్‌ కూల్‌డ్రింక్స్.. కాంబినేషన్‌ బాగనే ఉంటుంది..కానీ అస్సలు అలా తినకూడదట.. అస‌లు శీత‌ల పానీయాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తాగ‌రాదు. వాటిల్లో అధిక మొత్తంలో చక్కెర‌, క్యాల‌రీలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. అధికంగా బ‌రువును పెంచుతాయి. హార్మోన్ల స‌మ‌స్య‌లు వ‌చ్చేలా చేస్తాయి.
పండ్ల‌ను ఎప్పుడు కూడా భోజ‌నానికి, భోజ‌నానికి మ‌ధ్య‌లో 2 గంట‌ల వ్య‌వ‌ధి చూసుకుని తినాలి. కానీ కొంద‌రు భోజ‌నం చేసిన వెంట‌నే పండ్ల‌ను తింటారు. ఇలా కూడా చేయకూడదు…ఇలా పండ్ల‌ను తింటే వాటిల్లో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం శోషించుకోలేదు. భోజ‌నం చేసిన త‌రువాత లేదా చేయ‌డానికి 2 గంట‌ల ముందు మాత్ర‌మే పండ్ల‌ను తినాలి. అయితే భోజ‌నం చేసే ముందు వెజిట‌బుల్ స‌లాడ్ తింటే మంచిది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణ‌మ‌వుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news